Ravi Teja Takes Huge Remuneration For His Upcoming Movies

Filmibeat Telugu 2018-05-09

Views 1

Mass Maharaja Ravi Teja is getting whooping amount for his 2 film deal with Mythri Movie Makers. The sources says that Mass Maharaja had quoted Rs 20 Cr as his remuneration for Srinu Vaitla and Santhosh Srinivas’s movies but Naveen Yerneni, Y. Ravi Shankar and Mohan Cherukuri (CVM) (Mythri Movie Makers) have sealed the deal for Rs 16 Cr.
#RaviTeja
#SanthoshSrinivas

మైత్రి మూవీ మేకర్స్... ఈ పేరు టాలీవుడ్లో ఇపుడు మార్మోగి పోతోంది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం.... ఇలా ఒకదాన్ని మించి మరొకటి హిట్ కొడుతూ హాట్రిక్ కొట్టిన ఈ సంస్థ నెక్ట్స్ రవితేజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మైత్రి మూవీస్ వారు మాస్ మహారాజతో కుదుర్చుకున్న డీల్‌కు సంబంధించిన వివరాలు బయటకు లీక్ అయ్యాయి. రెండు సినిమాలకు కలిపి రూ. 16 కోట్లకు అగ్రిమెంట్ జరిగిందని ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ నడుస్తోంది.
ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్' చేస్తున్న రవితేజ..... దీని తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
రెండు సినిమాలకు కలిపి రవితేజ రూ. 20 కోట్లు అడిగినట్లు సమాచారం. అయితే మైత్రి మూవీ మేకర్స్ అధినేతలైన నవీన్ యర్నేని, వై రవి శంకర్, సివి మోహన్ కలిసి చర్చలు జరిపి రూ. 16 కోట్లకు డీల్ సెటిల్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ మధ్య సరైన హిట్స్‌లేని రవితేజ ‘రాజా ది గ్రేట్' సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘టచ్ చేసి చూడు' మూవీ నిరాశ పరిచింది. అయితే ఈ సారి అభిమానులను మెప్పించే ఫుల్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ ‘నేల టిక్కెట్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ద్వారా రవితేజ బాక్సాఫీసుపై విజృంభిచండం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS