Named captain of Sunrisers Hyderabad after the banned David Warner was ruled out of the Indian Premier League's 11th edition, Kane Williamson on Sunday said it's "impossible" for anyone, including Alex Hales, to be a replacement for the explosive Australian opener in the T20 franchise's setup.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో డేవిడ్ వార్నర్ స్థానం భర్తీ చేయలేదని ఆ జట్టు ప్రస్తుతం కెప్టెన్ కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. ఆదివారం జరిగిన ఓ మీడియా సమావేశంలో కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ 'గత కొన్నేళ్లుగా డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కోసం చాలా చేశాడు. అతను లేని లోటు పూడ్చటం అసాధ్యం' అని అన్నాడు.
'పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటం ఆనందకరం. ప్రతి మ్యాచ్‌లో ప్రదర్శన మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్లడం ముఖ్యం. ఐపీఎల్‌లో బలమైన జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లతో ఉన్న ఆ జట్టు ఎప్పుడూ ప్రమాదకారే' అని విలియమ్సన్ అన్నాడు.
టి20ల్లో డేవిడ్ వార్నర్ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడని కొనియాడాడు. సఫారీ గడ్డపై ఆతిథ్య దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, కామెరూన్ బాన్‌క్రాప్ట్‌లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్‌లో బీసీసీఐ డేవిడ్ వార్నర్‌ను ఐపీఎల్‌కు కూడా దూరం చేసింది. కాగా, ఐపీఎల్ టోర్నీలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది.