IPL 2018: Will Nitish Rana Miss CSK VS KKR Match???

Oneindia Telugu 2018-05-03

Views 15

Table toppers Chennai Super Kings (CSK) would look to continue its winning momentum and spoil the homecoming of Kolkata Knight Riders (KKR) in the Indian Premier League (IPL) tie at the Eden Gardens here on Thursday (May 3).
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్ నితీశ్‌ రాణా వెన్నునొప్పి కారణంగా బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు హాజరు కాలేదు. దీంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో గురువారం జరిగే మ్యాచ్‌కు నితీష్ రాణా అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అనుమానంగా మారింది.
అయితే దీనిపై ఆ జట్టు యాజమాన్యం స్పష్టమైన ప్రకటన ఏమీ చేయలేదు. ఐపీఎల్ 11వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తరుపున రాణిస్తున్న ఆటగాళ్లలో నితీష్ రాణా ఒకడు. అద్భుత ప్రదర్శనలతో ఈ సీజన్‌లో రెండు సార్లు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు కైవసం చేసుకున్నాడు.
అంతేకాదు జట్టు మిడిలార్డర్‌లో కోల్‌కతాకు కీలకంగా మారాడు. బెంగళూరులో ఏప్రిల్‌ 29న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగులు చేసిన రాణా వెన్నునొప్పితో ఆట మధ్యలోనే మైదానం వీడిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడిన రాణా 31.33 యావరేజితో 188 పరుగులు సాధించాడు.
#IPL 2018
#Kolkata knight riders
#Nitish rana

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS