Mahesh Babu wax statue in Madame Tussauds. After Prabhas.. Mahesh is the only telugu hero to get this opperchunity.
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన అభిమానులు సంతోషంగా ఉండే సమయం ఇది. భరత్ అనే నేను చిత్రం సంచలన విజయం సాధించి కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. మహేష్ బాబు నటనతో అదరగొట్టేసాడు. రాజకీయాలతో తనకు ఇటివంటి ప్రమేయం లేకున్నా మహేష్ ముఖ్యమంత్రిగా ఇరగదీసాడు. భరత్ అనే నేను చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్న తన అభిమానులకు మహేష్ మార్ గుడ్ న్యూస్ చెప్పాడు. మహేష్ అభిమానుల సంతోషాన్ని రెట్టింపు చేసే న్యూస్ ఇది. ప్రఖ్యాత మేడం టుస్సాడ్ మ్యూజియంలో మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని నెలకొల్పబోతున్నారు. ఈ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా వెల్లడించారు.
మేడం టుస్సాడ్ మ్యూజియంలో విగ్రహం ఉండడం అంటే అది అత్యంత అరుదైన గౌరవం అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు పలువురు భారతీయ ప్రముఖుల మైనపు విగ్రహాలు మేడం టుస్సాడ్ మ్యూజియంలో నెలకొల్ప బడ్డాయి.
ఇండియాకు చెందిన పలువురి మైనపు విగ్రహాలు టుస్సాడ్ మ్యూజియంలో నెలకొల్ప బడ్డాయి. కానీ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే ఆ అరుదైన అవకాశం దక్కించుకున్న తొలి తెలుగు వ్యక్తిగా అవతరించాడు. బాహుబలి తరువాత ప్రభాస్ క్రేజ్ జాతీయ వ్యాప్తం అయింది. ప్రభాస్ తరువాత ఆ అవకాశం దక్కించుకున్న రెండవ వ్యక్తిగా మహేష్ అవతరించాడు.
#Mahesh Babu
# Madame Tussauds
#wax statue