Kalyan Ram New Movie..Clapped By HariKrishna,NTR

Filmibeat Telugu 2018-04-26

Views 1

NTR launches Kalyan Ram news movie. Guhan is movie director. Niveda Thomas, Shalini Pandey are female leads

కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కలసి కనిపిస్తే నందమూరి అభిమానులకు ఎప్పుడూ పండగే. ఆ దృశ్యం మరో మారు ఆవిష్కృతం అయింది. కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం నేడు ప్రారంభం అయింది. ప్రారంభ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. హరికృష్ణ కూడా హాజరు కావడం విశేషం. తండ్రి కొడుకులు ఇలా కళ్యాణ్ రామ్ సినిమా వేడుకలో కలుసుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫస్ట్ క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. హరికృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేయడం విశేషం. ప్రస్తుతం నా నువ్వే చిత్రంలో నటిస్తున్న కళ్యాణ్ రామ్ వెంటనే మరో చిత్రాన్ని ప్రారంభించారు. మీడియా సమావేశాలో చిత్ర యూనిట్ విశేషాలని వెల్లడించారు.
ఈ చిత్రంలో జైలవకుశ ఫేమ్ నివేద థామస్, అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తుండడం విశేషం. నివేదా మాట్లాడుతూ.. అందరి అనుభవమే ఈ చిత్ర కథ అని తెలిపింది. ఏడు నెలల గ్యాప్ తరువాత మరో చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నానని అందుకు సంతోషంగా ఉందని నివేద తెలిపింది.
ఈ చిత్రానికి మహేష్ కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ రామ్ నటిస్తున్న నా నువ్వే చిత్రానికి కూడా ఆయనే నిర్మాత కావడం విశేషం. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, హరికృష్ణకు మహేష్ కోనేరు కృతజ్ఞతలు తెలియజేసారు.

మే 2 నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభించి ఈ ఏడాది ద్వితీయార్థంలో చిత్రాన్ని విడుదల చేస్తామని మహేష్ కోనేరు అన్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిరించబడుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS