టీడీపీ నేత ఆనం వివేకా కన్నుమూత

Oneindia Telugu 2018-04-25

Views 244

Nellore district TDP senior leader Anam Vivekananda Reddy is severely critical. He's being treated for undisclosed illness at Hyderabad private hospital. However, the doctors informed his family that his health condition had deteriorated further and finally leads to "he is no more"

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి(67) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ నేత ఆనం కిమ్స్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనకు తొలుత నెల్లూరులో చికిత్స చేయించుకున్నారు. మెరుగైన వైద్యాన్ని డాక్టర్లు సూచించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అయితే కిమ్స్‌ వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆనం తుదిశ్వాస విడిచినట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత ఆనం వివేకానందరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్‌లో రేడియేషన్ చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థతి ఆందోళనకరంగా ఉండటంతో వైద్య నిపుణులు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు.
విలక్షణమైన వ్యక్తిత్వం, మాటతీరు, వేషధారణతో నెల్లూరు జిల్లాలో సీనియర్ పొలిటీషియన్‌గా పేరొందిన ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన ఆయన గత ఎన్నికల అనంతరం సోదరుడితోపాటు హస్తం పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు.
ఇటీవల ఆనం ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కిమ్స్‌ ఆసుపత్రికి వచ్చి ఆయనను పరామర్శించారు. ఆనం ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి ఎండీ భాస్కర్‌రావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిమ్స్ ఆసుపత్రిలోనే ఉన్న ఆనం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు బాబు. ఆనంను పరామర్శించిన వారిలో బాబుతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణలు ఉన్నారు. కాగా ఆనం ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నెల్లూరు జిల్లా నుంచి ఆయన అభిమానులు భారీగా ఆసుపత్రికి వద్దకు చేరుకుంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS