Megastar Chiranjeevi conduct meeting with Tollywood heros. They discuss latest developments ments in industry.
శ్రీరెడ్డి, రాంగోపాల్ వర్మ వ్యవహారం, కాస్టింగ్ కౌచ్ వంటి అంశాలు టాలీవుడ్ ని కుదిపేస్తున్నాయి. గత ఎనిమిది నెలలుగా కొన్ని మీడియా సంస్థలు అనవసరమైన విషయాలని ప్రజల మీదికి ఎలా రుద్దుతున్నాయో అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తల్లిని అతిదారుణంగా దూషిచడం, ఆ క్లిప్పింగులని కొన్ని మీడియా ఛానల్స్ పదే పదే ప్రసారం చేయడం, డిబేట్లు పెట్టి లబ్ది పొందాలని చూశాయి. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని పవన్ కళ్యాణ్ నిరూపించారు.
ఇండస్ట్రీలో జరుగుతున్నా పరిణామాలని గమనించిన మెగాస్టార్ చిరంజీవి మంగళవారం రంగంలోకి దిగారు. అత్యవసరంగా, రహస్యంగా 25 టాలీవుడ్ హీరోలు, ఇండస్ట్రీ పెద్దలతో మంగళవారం రాత్రి అన్న పూర్ణ స్టూడియోస్ లో సమావేశం నిర్వహించారు.
మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సూపర్ స్టార్ మహెష్, అల్లు అర్జున్, రాంచరణ్, నాని, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి ప్రముఖ హీరోలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ మా అసోషషన్ కు వెళ్లి ఇండస్ట్రీ పెద్దలతో, మా సభ్యులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ గురించి ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తుంటే ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ నిలదీశారు. అప్పటి నుంచి ఇండస్ట్రీలో అంతర్మధనం మొదలైంది.
పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం టీవీ9, ఏబీఎన్, టివి5 ఛానల్స్ ని బాయ్ కాట్ చేయాలని అభిమానులకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సదరు ఛానల్స్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.
చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన హీరోల సమావేశంలో కూడా సంచలన ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. సదరు టివి ఛానల్స్ కు చిత్ర పరిశ్రమకు చెందిన ఆడియో వేడుకలు, యాడ్స్ ఇవ్వకూడదని ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. మరో మరు సమావేశం అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.