Sai Pallavi Talks About Her New Movie Kanam

Filmibeat Telugu 2018-04-23

Views 2.4K

Sai Pallavi and Naga Shaurya’s forthcoming film Kanam, which touches upon the sensitive issue of abortion, is set for a May 27 release. The movie is being directed by A.L. Vijay. Speaking about the film, Sai Pallavi said, “It is an intense subject and focuses on the bond between a mother and her four-year-old daughter.
నాగశౌర్య, సాయిపల్లవి నటించిన చిత్రం 'కణం'. ఎన్.వి.ఆర్ సినిమా స‌మ‌ర్ప‌ణ‌లో లైకా ప్రొడక్షన్స్ సినిమాను నిర్మించింది. విజయ్ దర్శకుడు. సినిమా ఏప్రిల్ 27న విడుదలవుతుంది.
ఈ సందర్భంగా సాయిప‌ల్ల‌వి తెలుగు ఫిలింబీట్‌తో మాట్లాడారు. నాగశౌర్యతో విభేదాల గురించి ఆమె వివరణ ఇచ్చారు. అలాగే తమిళంలో సూర్యతో చేస్తున్న సినిమా గురించి మాట్లాడారు. సాయిపల్లవి వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..
`క‌ణం` సినిమాతో ఆ ఆలోచనా విధానం మరింత మెరుగుపడిందనే చెప్పాలి. ఈ సినిమా చేస్తున్నంత సేపూ నన్ను నేను ఓ తల్లిగానే ఊహించుకుంటూ చేశాను. వెరోనికాతో బాగా క‌నెక్ట్ అయ్యాను. ఓ ర‌కంగా చెప్పాలంటే ఈ సినిమాపై నా ఆలోచనా తీరు మారింది. నాకు నేను కొత్త‌గా క‌న‌ప‌డుతున్నాను. ఈ సినిమా చేసిన తర్వాత తల్లి పాత్రలో ఎందుకు నటించానా? అన్న అసంతృప్తి మాత్రం అస్సలు లేదు.
నా మాతృభాష త‌మిళ‌మే అయినా, త‌మిళంలో డ‌బ్బింగ్ చెప్ప‌డానికి ఒక‌టిన్న‌ర రోజు ప‌ట్టింది. అదే తెలుగులో సగం రోజులోనే డ‌బ్బింగ్ చెప్పేశాను. మాతృభాష త‌మిళం కంటే తెలుగులోనే బాగా మాట్లాడుతాను.. డైలాగ్ చెబుతాన‌ని చాలా మంది అన్నారు. అదెంత నిజ‌మో! తెలియ‌దు కానీ.. తెలుగు కంఫ‌ర్ట్‌గా ఉంది. నేను ఎవ‌రినీ బాధ పెట్ట‌ను...
నాగశౌర్య‌గారు చాలా మంచి న‌టుడు. త‌ను కెమెరా ముందుకు రాగానే ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ అయిపోతారు. సాధార‌ణంగా షూటింగ్ స‌మ‌యాల్లో నేను ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను. నా డైరెక్ట‌ర్స్ బుర్ర తినేస్తాను. ఒక‌వేళ ఏదైనా స‌న్నివేశం స‌మ‌యంలో నాగ‌శౌర్య‌ను చూస్తే.. అత‌ను సైలెంట్‌గా ఉంటే.. అత‌నికి ఇంకా ఎక్కువ స‌మ‌యం కావాలేమోన‌నుకుని నేను సైలెంట్‌గా అయిపోయేదాన్ని.

త‌ను నేను మాట్లాడ‌టం లేద‌ని ఫీల‌య్యాడ‌నుకుంటా. నేను ఎవ‌రినీ బాధ పెట్ట‌ను. ఒక‌వేళ నా వ‌ల్ల ఎవ‌రైనా బాధ ప‌డ్డార‌ని తెలిస్తే ... వెంట‌నే సారీ చెప్పేస్తాను. డ‌బ్బింగ్ స‌మ‌యంలో అంద‌రం క‌లిసి డిన్న‌ర్ చేద్దామ‌ని నాగశౌర్య‌కు ఫోన్ చేద్దామ‌నుకుంటే.. అత‌ని వ‌ద్ద ఫోన్ లేద‌ని విజ‌య్‌గారు చెప్పారు. ఆయ‌న మేనేజ‌ర్‌కి కాల్ చేస్తే.. ఆయ‌న `ఛ‌లో` మూవీ ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నార‌ని చెప్పారు. నేను ఆ స‌మ‌యంలో ఎంతో బాధ‌ప‌డ్డాను. నేను ఆయ‌న్ను కావాల‌నే బాధ‌పెట్ట‌లేదు. ఒక‌వేళ నిజంగా బాధ పెట్టి ఉంటే సారీ చెప్పేస్తాను.

Share This Video


Download

  
Report form