Varun Tej and actress Raashi Khanna's latest outing 'Tholi Prema' has hit the screens on February 9, 2018.
ఫిదా చిత్రంతో సక్సెస్‌తోపాటు మంచి అభిరుచి కలిగిన నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు. ఫిదా తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి తొలిప్రేమ చిత్రంతో ముందుకొచ్చాడు. రాశీఖన్నాతో వరుణ్ కలిసి నటించిన చిత్రం ఫిబ్రవరి 10న రిలీజ్‌కు సిద్దమైంది. ఈ నేపథ్యంలో వరుణ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
పవన్ కల్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమాతో నేను నటించిన తొలిప్రేమకు కథాపరంగా ఎలాంటి సంబంధం లేదు. 20 ఏళ్ల క్రితం బాబాయ్ నటించిన తొలిప్రేమ అప్పటి జనరేషన్ అభిరుచులకు, ట్రెండ్‌కు తగినట్టుగా రూపొందించారు. ఇప్పుడు జనరేషన్ మారింది. ఈ తొలిప్రేమను ఇప్పటి జనరేషన్‌కు అనుగుణంగా రూపొందించాం.
పాత తొలిప్రేమను టెలివిజన్‌లో చూడటం తప్ప థియేటర్లకెళ్లి చూసినవారెవరూ లేరు. ఇక మా తొలిప్రేమ సినిమా ఇప్పటి జనరేషన్‌కు అనుగుణంగా రూపొందింది. అప్పటి జనరేషన్‌లో హీరో రక్తంతో ప్రేమలేఖ రాసి ఇస్తాడు. ఇప్పడు టెక్నాలజీకి అనుగుణంగా యువతి, యువకుల్లో తొలి ప్రేమ ఎలా చిగురించింది అనే అంశాలతో ఈ సినిమా రూపొందింది.
ఫిదా సినిమాకు తొలిప్రేమ సినిమా లవ్‌స్టోరికి ఎక్కడా పోలీక ఉండదు. ప్రేమమ్ సినిమా కథకు కూడా దారిదాపుల్లో ఉండదు. లండన్‌లో షూట్ చేసిన సన్నివేశాలు నాకు ఈ సినిమాలో బాగా నచ్చాయి. కాలేజ్ సీన్లలో నటించేటప్పుడు హ్యాపీగా అనిపించింది. మళ్లీ కాలేజ్‌కు వెళ్లామా అనే ఫీలింగ్ కలిగింది.
ఊహలు గుసగుసలాడే సినిమాలో రాశీఖన్నా చేసిన పెర్ఫార్మెన్స్ చూసి ఆమెను తొలిప్రేమకు ఎంపిక చేశాం. తొలి ప్రేమలోని హీరోయిన్ క్యారెక్టర్ రాశీఖన్నాకు సరిగ్గా సరిపోతుందని ఆమెను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకొన్నాం. పాత్రకు తగినట్టుగా ఆమె మారిపోయింది. 5 కేజీల బరువు కూడా తగ్గింది