Raviteja nela ticket movie teaser releasing tomorrow
రవితేజ నటించిన తాజా సినిమా నేల టికెట్. ఈ సినిమా టిజర్ అందరికి నచ్చేలా టిజర్ ఉండబోతోందని సమాచారం. రవితేజ మరోసారి తన ఎనర్జిటిక్ నటనతో అందరిని అలరించబోతున్నాడని చిత్ర యూనిట్ చెబుతోంది. మే లో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రాజా ది గ్రేట్ సినిమాతో కం బ్యాక్ అయిన మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో సొగ్గాడే చిన్నినాయనా' ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. నేల టికెట్ పేరుతో వస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరిని ఆకర్షించింది. మాళవిక శర్మ ఈ సినిమాలో రవితేజ సరసన నటిస్తోంది.
ఫిదా సినిమాకు సంగీతం అందించిన శక్తి కాంత్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు, చోటా కెప్రసాద్ ఈ సినిమాకు ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఎస్ ఆర్ టి బ్యానర్ లో రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వైజాగ్ నేపద్యలో తెరకేక్కబోతున్న ఈ సినిమాలో జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. రేపు ఈ సినిమా టిజర్ ను విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. అందరికి నచ్చేలా టిజర్ ఉండబోతోందని సమాచారం. రవితేజ మరోసారి తన ఎనర్జిటిక్ నటనతో అందరిని అలరించబోతున్నాడని చిత్ర యూనిట్ చెబుతోంది. మే లో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.