Ravi Teja and Pawan Kalyan Speech At Nela Ticket Movie Audio Launch. Nela Ticket is an upcoming Telugu film written and directed by Kalyan Krishna Kurasala. It features Tollywood Mass Maharaj Ravi Teja and Malvika Sharma in the lead roles which marks the latter’s debut in Telugu cinema.
# NelaTicket
#RaviTeja
#Tollywood
మాస్ మహారాజా 'రవితేజ' హీరోగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం 'నేల టిక్కెట్టు'. ఈ చిత్రం ఆడియో వేడుక గురువారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, రవితేజ మధ్య జరిగిన సంభాషణ నవ్వులు పూయించింది.
నాకు తెలిసిన వాళ్లలో చాలా స్ట్రైయిట్ ఫార్వర్డ్ గా ఉండే వారిలో జగపతి బాబు, పవన్ కళ్యాణ్ ఒకరు. మామూలుగా మనకు ఎన్నో కాంప్లిమెంట్స్ వస్తుంటాయి. ఎంతో మంది రకరకాలుగా పొగుడుతుంటారు. కొన్ని కాంప్లిమెంట్స్ ఎప్పటికీ మరిచిపోలేం. పదేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారితో ఫోన్లో మాట్లాడటం జరిగింది. ఆయన అపుడు నాకు ఓ కాంప్లిమెంట్ ఇచ్చారు. మీరు అంత సిగ్గులేకుండా ఎలా చేస్తారు? అని అడిగారు. ఆయన ఆ మాట అనడం ఎప్పటికీ మరిచిపోలేను. ప్రతి విషయంలో ఆయన చాలా ఓపెన్ గా ఉంటారు. అందుకే పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం... అని రవితేజ వ్యాఖ్యానించారు.
నేను యాక్టర్ అవ్వక ముందు వీధుల్లో తిరుగుతున్నపుడు నటుడిగా రవితేజను చూశాను. ఆయన నవ్వుల వెనక, పెర్ఫార్మెన్స్ వెనక చాలా తపన, చాలా కష్టం, చాలా కృషి, చెప్పలేని కష్టాలతో కూడిన బాధలు. ఒక వ్యక్తి ఇంత హాస్యం పండిస్తున్నాడంటే గుండెల్లో ఎంతో కొంత ఆవేదన, బాధ లేక పోతే హాస్యం అనేది రాదు. అందుకే రవితేజగారు అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. ఆయన నటుడిగా ఎదుగుతున్న స్థాయి నుండి చాలా దగ్గరగా చూశాను. ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా తట్టుకుని నిల్చుని ఈస్థాయిలో ఉండటం ఆనందంగా ఉంది... అని పవన్ కళ్యాణ్ అన్నారు.
రవితేజ చెప్పింది నిజమే... ఈయన ఇంత సింగ్గులేకుండా ఎలా యాక్ట్ చేస్తాడో అనుకుంటూ ఉంటాను. ఇది నేను చాలా ఇష్టంతో చెప్పిన మాట. నాకు అంత సిగ్గు వదిలేసి యాక్ట్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. రవితేజ ఎంత మంది జనం ఉన్నా, ఎలాంటి పాత్ర చేయాలనుకున్నా సిగ్గు అనే పదాన్ని ఇంట్లో పెట్టేసి బయటకు వచ్చి చాలా బలంగా చేయగలరు. అందుకే ఆయనంటే ఇన్స్‌స్పిరేషన్. ఈ సినిమా నేల టికెట్ ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... అని పవన్ కళ్యాణ్ తెలిపారు.