Virat Kohli, who became the leading run-getter of Indian Premier League on Tuesday, talked about how AB de Villiers inadvertently helped him in the recently concluded Test series against South Africa.
మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎవరు అంటే ముందుగా వినిపించే పేర్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్.మూడు ఫార్మాట్లలో కూడా వీరిద్దరూ అద్భుతమైన రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు. ఎలాంటి పిచ్ మీదైనా, ఎలాంటి బౌలర్‌నైనా అలవోకగా ఎదుర్కొంటారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు వీరిద్దరూ రెండు పిల్లర్లు లాంటి వారు. ఇద్దరూ ఒకరిని మరొకరు పరస్పరం గౌరవించుకుంటారు.
తాజాగా ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో డివిలియర్స్‌లా తాను అన్ని రకాల షాట్లు ఆడలేనని కోహ్లీ స్పష్టం చేశాడు. సృజనాత్మక షాట్లు నాకు సాధ్యం కావు. ఏబీ డివిలియర్స్ లాంటి వాళ్లకు అన్ని రకాల షాట్లూ ఆడే సామర్థ్యం ఉంది. నేను రక్షణాత్మకంగా ఆడతానని క్రికెట్ విశ్లేషకులు చెబుతుంటారు. కానీ ఏబీ డివిలియర్స్ తరహా నైపుణ్యం నాకు లేదు. ఆ షాట్లను నేనెప్పుడూ సాధన కూడా చేయలేదు.ఫాస్ట్‌బౌలర్ బౌలింగ్‌లో బంతిని రివర్స్ స్వీప్ చేసి సిక్స్ బాదగల నైపుణ్యం ఏబీ సొంతం. నా జీవితంలో అలాంటి నైపుణ్యం ఎక్కడా చూడలేదు. ఇలాంటివే క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్తాయి' అని కోహ్లీ చెప్పాడు.
అదే సమయంలో ఏబీ డివిలియర్స్ కూడా కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. 'తనకు కొన్ని షాట్లు ఆడే నైపుణ్యం లేదని కోహ్లీ అంటాడు. కానీ 360 డిగ్రీల్లో షాట్లు ఆడేవాళ్లు విరాట్ కోహ్లీ తరహాలో అలవోకగా లాంగాన్, లాంగాఫ్‌లో సిక్సర్లు బాదలేరు. అందుకే వాళ్లు వేరే మార్గాలను అనుసరిస్తుంటారు' అని డివిలియర్స్ అన్నాడు.
కోహ్లీకి వైవిధ్యమైన షాట్లు ఆడాల్సిన అవసరమే రాదు. పదిసార్లు ప్రయత్నిస్తే తొమ్మిదిసార్లు తాను అనుకున్న షాట్ ఆడగలడు' అని ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. ఆటపట్ల కోహ్లీకి ఉన్న అంకితభావమే అతడిని అత్యుత్తమ ఆటగాడిగా మార్చిందని ఏబీ అభిప్రాయపడ్డాడు.