బీజేపీ గెలుపు ఖాయం : అమిత్ షా

Oneindia Telugu 2018-04-14

Views 137

The BJP wave is what has forced Karnataka Chief Minister to re-think on his constituency, BJP chief, Amit Shah said.

త్వరలో కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీనే విజయం సాధిస్తుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తమ గెలుపు ఇప్పటికే ఖాయమైపోయిందని అన్నారు. ఇందుకు కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన నియోజకవర్గాన్ని మార్చుకోవడమే ప్రత్యక్ష నిదర్శనమని అమిత్ షా వ్యాఖ్యానించారు. కిత్తూరులో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా అమిత్ షా మాట్లాడారు.
బీజేపీ హవాను తట్టుకోలేక సిద్ధరామయ్య తన నియోజకవర్గాన్ని మార్చుకుంటున్నారని చురకలంటించారు. ఇది తమ తొలి విజయమని అమిత్ షా అన్నారు. కర్ణాటకలో బీజేపీ విజయం సాధిస్తుందనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదని వ్యాఖ్యానించారు. మే 12న కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా, సిద్ధరామయ్య తాను ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణ నియోజకవర్గం నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS