If reports are anything to go by, Young Tiger Jr NTR and Mega Powerstar Ram Charan will preside over the audio launch of Prince Mahesh Babu’s ‘ Bharat Ane Nenu’, scheduled to take place on April 7 in LB stadium, Hyderabad, as its chief guests. It is a pleasant surprise for the fans of both the Tollywood stars as all the biggies would be seen in on one stage together.
సూపర్‌స్టార్ మహేష్‌బాబు, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్ అనే నేను'. ఈ చిత్రం ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ 'భరత్ బహిరంగ సభ' పేరుతో ఏప్రిల్ 7 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియంలో ప్రేక్షకులు, అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో వైభంగా జరగనుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వేడుకకు ఎన్టీఆర్, రామ్ చరణ్ చీఫ్ గెస్టులుగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ముగ్గురు పెద్ద హీరోలు ఒక వేదికపై కనపడి అభిమానులకు కన్నుల విందు చేయడం ఖాయం.
కాగా, ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు రెండు పాటలు విడుదలయ్యాయి. భరత్ అనే నేను టైటిల్ సాంగ్, 'ఐ డోంట్ నో' పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్ మహేష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తారు.