A special aircraft carrying the bodies of 38 of 39 Indians, who went missing in Mosul in June 2014 and whom the government recently declared expired , landed in Amritsar on Monday. Of the 39 who expired, 27 were from Punjab, four from Himachal Pradesh, two from West Bengal and six from Bihar.
ఇరాక్‌లో అపహరణకు గురై ఐఎస్ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 38 మంది భారతీయుల మృతదేహాలను సోమవారం భారత్‌కు తీసుకువచ్చారు.భారతీయుల మృతదేహాలను భారత్‌కు తీసుకొచ్చేందుకు ఆదివారం వీకే సింగ్ ఐఏఎఫ్ విమానంలో ఇరాక్‌లోని మోసుల్ ప్రాంతానికి వెళ్లారు. చనిపోయిన వారిలో 27 మంది పంజాబ్‌కు చెందిన వారు కాగా, మరో నలుగురు బీహార్ వాసులుగా గుర్తించారు.
ఉపాధి నిమిత్తం ఇరాక్‌లోని మోసుల్ నగరం వెళ్లి కూలీలుగా పనిచేస్తున్న ఓ భారతీయుల బృందం 2014లో కిడ్నాప్‌కు గురైంది. మోసుల్ నుంచి తిరిగి వస్తుండగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అడ్డగించి వీరిని బందీలుగా చేసుకున్నారు. అప్పటి నుంచి వీరి ఆచూకీ తెలియరాలేదు. వీరిని విడిపించేందుకు భారత ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. కాగా, వీరిలో ఒకరైన హర్జిత్ మాసీ అనే వ్యక్తి ఆ మధ్య ఇస్లామిక్ చెర నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో ఆయన కొన్ని కీలక విషయాలు చెప్పారు. తనతో పాటు బందీలుగా ఉన్న మిగతావారిని బాదుష్ సమీపంలోని ఎడారిలో చంపేసినట్లు తెలిపారు. అయితే, హర్జిత్ వ్యాఖ్యలను ప్రభుత్వం తోసిపుచ్చింది.
సరైన ధ్రువీకరణ లేకుండా వారంతా చనిపోయారని భావించడం సరికాదని భావించింది. కాగా, స్థానిక అధికారులు.. గత జులైలో మోసుల్ నగరంలో ఒకేచోట వందల సంఖ్యలో సామూహిక సమాధులు గుర్తించారు.దీంతో ఆ దిశగా విచారణ చేపట్టారు.ఈ క్రమంలో 39 మంది భారతీయులు చనిపోయినట్లు తేలింది. డీఎన్‌ఏ పరీక్షతో వారు చనిపోయారని నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు తెలిపారు.ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే వీరిని చంపేసినట్లు చెప్పారు.