మమతా బెనర్జీ వైఖరికి, కేసిఆర్ వైఖరికి మధ్య పొత్తు కుదురుతుందా ?

Oneindia Telugu 2018-03-29

Views 594

Trinamul chief Mamata Banerjee on Wednesday met UPA chairperson Sonia Gandhi and sought the Congress support to regional parties in the 2019 general elections.

జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు షాక్ ఇచ్చేట్లే కనిపిస్తున్నారు. బిజెపి, కాంగ్రెసులకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పీపుల్స్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తానని కేసీఆర్ చెబుతుండగా మమతా బెనర్జీ మాట మరో విధంగా ఉంది. ఢిల్లీలో ఆమె వివిధ పార్టీల నాయకులను కలుస్తూ ఫ్రంట్‌పై చర్చలు చేస్తున్న విషయం తెలిసిందే.
వచ్చే ఎన్నికల్లో బిజెపిని ముఖాముఖి ఎదుర్కోవడానికి ప్రాంతీయ పార్టీలకు సహకారం అందించాలని మమతా బెనర్జీ యూపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీని కోరారు. రాష్ట్రాల స్థాయిలో ముఖాముఖి పోటీకి సహకరించాలని ఆమె అడిగారు.
బిజెపిని ఎదుర్కోవడానికి ఏ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు మమతా బెనర్జీ సుముఖత వ్యక్తం చేశారు. అయితే, కాంగ్రెసు నేతృత్వంలోని ఫ్రంట్‌లో భాగస్వామి కావడానికి మాత్రం ఆమె ఇష్టపడడం లేదు. ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే ఫ్రంట్‌కు కాంగ్రెసు సాయం పొందాలనేదే ఆమె అభిమతంగా కనిపిస్తోంది. అయితే, అది కాంగ్రెసుకు వ్యతిరేకమైన ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే వైఖరి మాత్రం కాదు.
వివిధ పార్టీల నేతలను కలిసిన మమతా బెనర్జీ మంగళవారంనాడు- సోనియా గాంధీ కార్యాలయంలో ఉన్నారా, లేదా తెలుసుకోవాలని ఓ రాయబారిని పంపించారు. అయితే, సోనియా అప్పటికే వెళ్లిపోయారని సమాచారం వచ్చింది. బుధవారం సాయంత్రం కలుద్దామని సోనియా మమతా బెనర్జీ సందేశం పంపించారు. బుధవారంనాడు వారిరువురి మధ్య గంటపాటు సమావేశం జరిగింది. తాను ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా సోనియాను కలుస్తానని, తమ మధ్య సంబంధాలు బాగున్నాయని, సోనియా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నానని మమతా బెనర్జీ చెప్పారు.
కేసిఆర్ మాత్రం తమ ఫ్రంట్ బిజెపికి మాత్రమే కాకుండా కాంగ్రెసుకు కూడా వ్యతిరేకమని అంటున్నారు. కాంగ్రెసు, బిజెపిలు దేశాన్ని 70 పాలించాయని, పాలనలో ఆ రెండు పార్టీలు కూడా విఫలమయ్యాయని ఆయన వాదిస్తున్నారు. ఇటువంటి స్థితిలో మమతా బెనర్జీ వైఖరికి, కేసిఆర్ వైఖరికి మధ్య పొత్తు కుదురుతుందా అనేది అనుమానంగా ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS