#RRR: Rajamouli R Sentiment for Heroines

Filmibeat Telugu 2018-03-28

Views 689

Interesting details on Rajamouli 'R' sentiment. rajamouli searching for heroines

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌలి భారీ మల్టీస్టారర్ చిత్రానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. '#ఆర్‌ఆర్‌ఆర్' హ్యాష్ ట్యాగ్ తో ఇటీవలఈ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని #ఆర్‌ఆర్‌ఆర్ అనే హ్యాష్ టాగ్ తో పిలుస్తారు. రాంచరణ్, రామారావు(జూ.ఎన్టీఆర్) , రాజమౌళి ముగ్గురి పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరంతో ఈ హ్యాష్ టాగ్ ని క్రియేట్ చేసారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే హీరోయిన్ల ఎంపిక విషయంలో కూడా రాజమౌళి ఇదే సెంటిమెంట్ ని ఫాలో అవుతుండడం ఆసక్తిని రేపుతోంది.
ఈ చిత్రంలో హీరోయిన్లుగా ఆర్ అక్షరంతో మొదలయ్యే పేర్లు కలిగిన హీరోయిన్లనే రాజమౌళి ఎంపిక చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి ఈ సెంటిమెంట్ ని ఎందుకు ఫాలో అవుతున్నాడో అని అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఇప్పటికే రాశి ఖన్నా పేరు వినిపించింది. తాజగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా వినిపిస్తోంది. వీరి పేర్లు ఆర్ అక్షరంతో మొదలవుతుండడంతో రాజమౌళి వీరిని ఎంపిక చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తాజగా ఛలో ఫేమ్ రష్మిక మందన పేరు కూడా వినిపిస్తుండడం విశేషం.
రాజమౌళి తన కథల్లో నిగూఢంగా దాగివున్న అంశం చివరి వరకు బయటపడదు. అదే తరహాలో ఈ ఆర్ లో కూడా ఏదో మతలబు ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆ విషయం బయట పడాలంటే స్వయంగా రాజమౌళే నోరు తెరవాలి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS