Amy Jackson sensational decision on Indian movies. She wants to settle in Africa
పాలరాతి శిల్పంలా ఉండే రూపం, యువతని మత్తెక్కించే చూపులు తెల్లతోలు పిల్ల అమీజాక్సన్ సొంతం. సోషల్ మీడియాలో అమీ ఘాటు అందాలతో చెలరేగుతున సంగతి తెలిసిందే. కాగా తాజాగా అమీజాక్సన్ తన అభిమానులని నిరాశ పరిచే విధంగా కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అమీ జాక్సన్ మోడల్ గా రాణిస్తున్న సమయంలో మదరాసు పట్టణం అనే తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రంతోనే నటిగా తానేంటో నిరూపించుకుంది అమీ జాక్సన్.
తక్కువ సమయంలోనే అమీజాక్సన్ కు శంకర్ దర్శకత్వంలో నటించే ఛాన్స్ వచ్చింది. విక్రంతో కలసి నటించిన ఐ చిత్రం నిరాశ పరిచినప్పటికీ అమీ జాక్సన్ కు అవకాశాలు వచ్చాయి. అమీ జాక్సన్ బాలీవుడ్ లో కూడా కొన్ని చిత్రాల్లో మెరిసింది.
అమీజాక్సన్ ప్రస్తుతం తన ఆశలన్నీ రజినీకాంత్ సరసన, శంకర్ దర్శకత్వంలో రెండవ సారి నటిస్తున్న 2.ఓ చిత్రంపైనే ఉన్నాయి.
అమీ జాక్సన్ ఓ కఠిన నిర్ణయం తీసుకుందటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అమీ జాక్సన్ ఇక భారతీయ చిత్రాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుందట. అందం అభినయం అని ఉన్నప్పటికీ అవకాశాలు ఆశించితిన్ స్థాయిలో రాకపోవడం, ఆశలు పెట్టుకున్న 2.ఓ చిత్రం తరచుగా వాయిదా పడుతుండడంతో అమీ నిరాశకు గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇండియన్ సినిమాకు గుడ్ బై చెప్పి ఆఫ్రికాలోని మొరాకోలో సెటిల్ కావాలని అమీజాక్సన్ ఇటీవల చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదెంతవరకు నిజమో అమీజాక్సన్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.