రణవీర్ సింగ్, సారా అలీ ఖాన్ చలికాలంలో వేడి పుట్టించడం ఖాయం !

Filmibeat Telugu 2018-03-20

Views 815

Rohit Shetty’s upcoming film ‘Simmba’ starring Ranveer Singh has been in search of its female lead. After all the names that were doing rounds in the media, the makers finally locked Sara Ali Khan for the role.

తెలుగులో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'టెంపర్' సూపర్ హిట్టవ్వడంతో ఈ చిత్రాన్ని హిందీలో రణవీర్ సింగ్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయమై కొన్ని రోజులుగా రకరకాల ప్రచారం జరిగింది. ఈ చిత్రంలో ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా వారియర్ అవకాశం దక్కించుకుందనే వార్తలు సైతం వినిపించాయి. ఈ నేపథ్యంలో ‘టెంపర్' హిందీ రీమేక్‌లో రణవీర్ సింగ్ సరసన హీరోయిన్‌గా సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్‌ను ఖరారు చేస్తూ నిర్మాత కరణ్ జోహార్ అఫీషియల్ ప్రకటన చేశారు.
తనకు ‘టెంపర్' రీమేక్ లో అవకాశం వస్తుందనే వార్తలు ప్రచారంలోకి రావడంతో ప్రియా వారియర్ కూడా ఆనంద పడింది. తన అభిమాన బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ అని, అతడితో అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని కూడా తెలిపారు. అయితే కరణ్ జోహార్ ప్రకటనతో ప్రియా వారియర్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
‘టెంపర్' చిత్రాన్ని హిందీలో ‘సింబా' పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రణవీర్ సింగ్, సారా అలీ ఖాన్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. దీంతో పాటు రోహిత్ శెట్టి-కరణ్ జోహార్ కలిసి చేస్తున్న తొలి చిత్రం కూడా ఇదే.
సింబా చిత్రంలో సారా అలీ ఖాన్ హీరోయిన్ గా ఖరారైంది. డిసెంబర్ 28, 2018న సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. వచ్చే చలికాలంలో ఈ సినిమా వేడి పుట్టించడం ఖాయం అంటూ కరణ్ జోహార్ ట్వీట్ చేశారు.

Share This Video


Download

  
Report form