The Congress’ three-day plenary session commenced at the Constitution Club in New Delhi on Friday. The focus of the conclave is primarily to prepare for the 2019 Lok Sabha elections. Andhra Pradesh special status motion introduced in Congress plenary held in Delhi.
కాంగ్రెస్ పార్టీ అధినేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన నేతృత్వంలో శనివారం 84వ కాంగ్రెస్ ప్లీనరీ ఇందిరా గాంధీ మైదానంలో జరిగింది.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ఈ ప్లీనరీ దేశానికి, కాంగ్రెస్ సభ్యులకు మార్గదర్శనం కావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీని నడిపించడంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ మొత్తాన్ని ఏకం చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. పార్టీలోని అనుభవజ్ఞులు యువతకు మార్గనిర్దేశం చేయాలన్నారు.
కాగా, ప్లీనరీ సమావేశంలో సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తోపాటు భారీ ఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్లీనరీ సమావేశాల నిర్వహణను ప్రియాంక గాంధీ చూసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ ప్లీనరీలో తీర్మానం చేశారు. మన్మోహన్ హయాంలో ఏపీకి ఇచ్చిన అన్ని హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని ప్లీనరీలో కాంగ్రెస్ పునరుద్ఘాటించింది.
ఏపీ హామీల అమలులో జరిగిన అన్యాయం, కేంద్రం నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ ప్లీనరీలో తీర్మానం చేశారు. తీర్మానంపై చర్చించిన అనంతరం ప్లీనరీ ఆమోదించనుంది. విభజన బిల్లును పార్లమెంటు ఆమోదించిన సమయంలో హోదాతోపాటు పలు హామీలను కేంద్రం ఇచ్చిన సంగతి తెలిసిందే.