ఎన్డీఎ తో చంద్రబాబు తెగదెంపులు చూసి జాగ్రత్త పడుతున్న మరి కొన్ని పార్టీలు !

Oneindia Telugu 2018-03-16

Views 4K

In the wake of Telugu Desam Party (TDP) prsident and Andhra Pradesh CM Nara Chnadrababu Naidu's breakup with NDA, Bihar CM Nitish Kumar may take strong decission.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజెపి నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఎ) నుంచి తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మరిన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు ప్రత్యేక హోదాను ఎత్తుకోవడంతో బీహార్ ముఖ్యమంత్రి, జెడీయు అధినేత నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే తన డిమాండ్‌ను మరోసారి తెరపైకి తేవాలని అనుకుంటున్నారు.
బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ కుమార్ నిర్ణయం తీసుకున్న వియాన్ని జెడియూ నేత కెసి త్యాగి ధ్రువీకరించారు.
ప్రస్తుతం జెడియు ఎన్డీఎలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు బీహార్‌లో తలెత్తకుండా నితీష్ కుమార్ ముందుగానే జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఆరారియా లోకసభ ఉప ఎన్నిక ఫలితం కూడా నితీష్ కుమార్‌ను పునరాలోచనలో పడేసింది. అర్జెడీ ఆ స్థానాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో జెడియూ భవిష్యత్తుపై ఆయన ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. చంద్రబాబు పరిస్థితి తనకు రాకూడదని నితీష్ కుమార్ భావిస్తున్నట్లు సమాచారం.
ఎన్డీఎలో కొనసాగుతూ ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఇంత కాలం రాజీ పడినట్లు కనిపించారు. దీంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రత్యేక హోదా నినాదాన్ని ఎత్తుకుని రాజకీయంగా బలపడాలని చూశారు. అది కొంత మేరకు ఫలితం కూడా ఇచ్చింది. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబను నిలదీశారు. దీంతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడి రాజకీయ భవిష్యత్తు కోసం అనివార్యమైన స్థితిలో ఎన్డీఎతో తెగదెంపులు చేసుకున్నారు.
నితీష్ కుమార్ తాజా ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కూడా ఎన్డీఎలో కొనసాగే విషయంపై పునరాలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రత్యేక హోదా వస్తే బీహార్‌లో పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు లభిస్తాయనే నినాదాన్ని తీసుకుని నితీష్ కుమార్ ముందుకు సాగాలని అనుకుంటున్నారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS