Rohit Sharma, Shikhar Dhawan Not Right Choice For Grade A+

Oneindia Telugu 2018-03-12

Views 73

Pakistan cricketer Wasim Akram has questions over BCCI decision to promote Rohit Sharma and Shikhar Dhawan to Grade A+ category while keeping test specialists like Cheteshwar Pujara, R Ashwin and Ravindra Jadeja in the Grade A section.

ఇటీవల భారత క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్‌ వేతనాలను బీసీసీఐ భారీగా పెంచడంతో.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించే ఆటగాళ్ల ప్రతిభ ఆధారంగా నూతన కాంట్రాక్ట్‌ ప్రకారం వేతనాలు ఇస్తున్నట్లు బీసీసీఐ పాలక మండలి వెల్లడించింది. దీనిలో భాగంగా కీలక ఐదుగురు ఆటగాళ్లను ఏ ప్లస్‌ గ్రేడ్‌లో చేర్చి వారికి ఏకంగా రూ.7కోట్లు ఇవ్వనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఏ ప్లస్‌ గ్రేడ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, శిఖర్ ధావన్‌, రోహిత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ర్పీత్‌ బుమ్రా ఉన్నారు. అయితే ఈ గ్రేడ్‌లో టెస్ట్‌ స్పెషలిస్ట్‌లు ఛతేశ్వర్‌ పుజారా, అశ్విన్‌, రవీంద్ర జడేజాను కాదని.. రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌కు చోటు కల్పించడం సరైన నిర్ణయం కాదంటూ పాకిస్థాన్‌ క్రికెట్‌ మాజీ దిగ్గజం వసీం అక్రం అంటున్నాడు. ఇదిలాఉండగా రోహిత్‌, ధావన్‌ కూడా టెస్ట్‌ క్రికెట్‌లో తమని తాము అంతగా నిరూపించుకోలేకపోయారు. కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనే రాణిస్తున్నారు. అయినా వారికి ఏ ప్లస్‌ గ్రేడ్‌ కేటాయించడం పట్ల వసీం అక్రం తన అభిప్రాయాన్ని వెలువరించడం చర్చకు దారి తీసింది.

Share This Video


Download

  
Report form