Tripura Results : Meet Sunil Deodhar, Man Behind BJP's Sweep

Oneindia Telugu 2018-03-03

Views 1

Deodhar, originally from Mumbai, set up camp in Tripura a little over two years ago to build BJP's campaign against the ruling Left Front government.

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ ఒక్కో రాష్ట్రాన్ని తన వశం చేసుకుంటోంది. ఉత్తరాదిన ఎంతో ప్రభావం చూపగలిగే కమలం పార్టీకి దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు తక్కువ. నిన్నటి దాకా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ గురించి మాట్లాడుకోవడమే వృథా అనిపించిందే.
కానీ నాలుగేళ్లలో అంతా రివర్స్ అయింది. ఈశాన్యంలో ఉన్న ఏడు రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. తాజాగా, వచ్చిన ఫలితాలతో త్రిపుర, నాగాలాండ్‌లలోను విజయదుందుభి మోగించింది. దీంతో నిన్నటి వరకు ఈశాన్యంలో కనిపించని కమలం.. ఒక్కసారిగా ఐదు రాష్ట్రాలను పరిపాలిస్తోంది.
త్రిపురలో గత ఇరవై అయిదేళ్లుగా సీపీఎం అధికారంలో ఉంది. పశ్చిమ బెంగాల్ తర్వాత సీపీఎంకు త్రిపురదే రికార్డ్. ఆ రికార్డ్ బీజేపీ చేతిలో మట్టికరిచింది. మాణిక్ సర్కార్ నేతృత్వంలో ఆ పార్టీకి తిరుగులేకుండా పోయింది. కానీ తాజా ఎన్నికల్లో 25 ఏళ్ల లెఫ్ట్ ప్రస్తానానికి బీజేపీ బ్రేకులు వేసింది. త్రిపురలో బీజేపీ అద్భుత విజయం సాధించింది.
60 అసెంబ్లీ స్థానాలకు గాను 2013లో బీజేపీకి ఉన్న ప్రాతినిథ్యం సున్నా. అదే సీపీఎం 49 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు రివర్స్ అయింది. బీజేపీ ఏకంగా సున్నా నుంచి నలభై స్థానాలకు ఎగబాకింది. 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న, గత ఎన్నికల్లో 49 స్థానాలు గెలిచిన సీపీఎం 18 స్థానాలకు పడిపోయింది
త్రిపురలో బీజేపీ గెలుపు వెనుక సునీల్ దియోదర్ ఉన్నారు. ఇతను 2014లో వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీకి మేనేజర్‌గా పని చేశారు. గత మూడేళ్లుగా త్రిపురలో మకాం వేసి, బీజేపీ గెలుపు కోసం పని చేశారు. దాని ఫలితం ఇప్పుడు కమలం పార్టీకి కనిపించింది. 2013లో బీజేపీ 1.4 శాతం ఓట్లు సాధించింది. సీపీఎం 48.11 శాతం ఓట్లు సాధించింది. కానీ తాజా ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. త్రిపురలో బీజేపీ గెలుపు వెనుక సునీల్ దియోదర్ పాత్ర ఎంతో ఉంది. ఆయన గతంలో ఆరెస్సెస్ ప్రచారక్‌గా పని చేశారు. మేఘాలయలో ఉంటారు.

Share This Video


Download

  
Report form