Tripura Election Results : BJP Stops Left's 20-Year Run

Oneindia Telugu 2018-03-03

Views 47

The Left has been in power Agartala for 25 years, with Manik Sarkar staying in the chief minister's chair for the past two decades.

రెండు దశాబ్దాలుగా త్రిపురను ఏకఛత్రాధిపత్యంతో ఏలుతూ వచ్చిన సీపీఎం పాలనకు బీజేపీ బ్రేక్ వేసింది. మాణిక్ సర్కార్ నేత్రుత్వంలోని సీపీఎం పార్టీని వెనక్కి నెట్టి స్పష్టమైన మెజారిటీ దక్కించుకుంది బీజేపీ. ఇప్పటికే అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లో పాగా వేసిన బీజేపీ ఇప్పుడు త్రిపురను కూడా హస్తగతం చేసుకుని ఈశాన్య రాష్ట్రాల్లో మరింత పట్టు పెంచుకుంది.
25ఏళ్ల సీపీఎం సుదీర్ఘ పాలనను చూసిన త్రిపుర ప్రజలు మార్పు కోరుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే త్రిపురలో అత్యధికంగా 91శాతం ఓటింగ్ నమోదవగా.. ఇందులో ఎక్కువ శాతం యువత బీజేపీకే ఓటు వేసినట్టు చెబుతున్నారు.
తాజా ఎన్నికల్లో ఇండిజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ (ఐపీఎఫ్‌టీ)తో జతకట్టిన బీజేపీ.. గిరిజన పార్టీ అయిన ఐపీఎఫ్‌టీతో పొత్తు గిరిజన, గిరిజనేతర ఓట్లను చీల్చిందని చెబుతున్నారు. 2013లో సీపీఎం 20ఎస్టీ స్థానాలకు గాను 18 స్థానాలు గెలుచుకోగా.. ఐపీఎఫ్‌టీతో పొత్తు కారణంగా అందులో కొన్ని స్థానాలు ఇప్పుడు బీజేపీ ఖాతాలోకి వెళ్లినట్టు చెబుతున్నారు.
గత మూడేళ్లుగా క్షేత్ర స్థాయిలో ఆర్ఎస్ఎస్ చేసిన కార్యాచరణ కూడా బీజేపీ గెలుపుకు కారణంగా చెబుతున్నారు. త్రిపురలో ఇంటింటికి తిరిగి ఆర్ఎస్ఎస్ చేసిన ప్రచారం ప్రజలను బాగానే ప్రభావితం చేసిందంటున్నారు.
త్రిపురలోని పలు ప్రజా సమస్యలను బీజేపీ ఎత్తిచూపడం కూడా అక్కడి ప్రజలను ఆకట్టుకుందంటున్నారు. ప్రధానంగా నిరుద్యోగం, అవినీతి విషయాల్లో త్రిపుర సర్కార్ విఫలమైందన్న విమర్శలున్నాయి. లేబర్ బ్యూరో డేటా ప్రకారం.. దేశంలో అత్యధికంగా 19.7శాతం నిరుద్యోగం త్రిపురలో ఉంది. బీజేపీ ఎన్నికల ర్యాలీల్లో ఈ సమస్యను హైలైట్ చేయడం ఆ పార్టీకి కలిసొచ్చింది. సీపీఎం సుదీర్ఘ పాలనలో నిరుద్యోగల సంఖ్య 25వేల నుంచి 7.33లక్షలకు పెరిగిందని, ఇదే ఆ పార్టీ సాధించిన ఘనత అని బీజేపీ ప్రచారం చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS