Vijay Fans Overaction...! మీ హీరో ఏం పీకలేక పోయాడుగా..!

Filmibeat Telugu 2018-03-02

Views 314

After Kaala teaser released... Rajinikanth-Vijay fans fight it out on social media. Since its release, the fans have been keeping a close eye on the number of likes and hits on YouTube and comparing it with another blockbuster Mersal starring Vijay.

ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు బేషజాలకు పోయి గొడవలు పడటం లాంటి సంస్కృతి ఇప్పటిది కాదు. ముఖ్యంగా దక్షిణాదిన.... తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఇదీ మరీ ఎక్కువ.
తమిళ స్టార్ విజయ్ నటించిన ‘మెర్సల్' మూవీ టీజర్ అప్పట్లో తమిళ సినీ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. అయితే మార్చి 2న విడుదలైన రజనీకాంత్ ‘కాలా' టీజర్ ‘మెర్సల్' రికార్డు దరిదాపుల్లో కూడా లేక పోవడంతో..... విజయ్ అభిమానులు ఓవరాక్షన్ మొదలు పెట్టారు.
సోషల్ మీడియాలో ఈ వివాదానికి తెరలేపింది మొదట విజయ్ అభిమానులే అని టాక్. మీ హీరో ఏం పీకలేక పోయాడుగా అని అర్థం వచ్చేలా.... కొందరు కామెంట్స్ చేయడంతో రజనీకాంత్ అభిమానులు ఎదురుదాడి ప్రారంభించారు. దీంతో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
‘మెర్సల్' మూవీ తొలి 5 గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్, 6 లక్షల లైక్స్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా విడుదలైన ‘కాలా' టీజర్ 11 గంటల్లో కేవలం 2.7 మిలియన్ వ్యూస్, 2.3 లక్షల లైక్స్ దక్కించుకుని చాలా వెనకబడిపోయింది.
‘కాలా' టీజర్ కొన్ని రోజుల ముందే వాట్సాప్, సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది. ఆ ఎఫెక్ట్ బాగా పడింది. అందుకే ఇపుడు విడుదలైన ‘కాలా' టీజర్ అనుకున్న రెస్పాన్స్ రావడం లేదని, లేక పోతే రజనీకాంత్ స్థాయికి ‘మెర్సల్' రికారక్డు బద్దలయి ఉండేదని అంటున్నారు విశ్లేషకులు.

Share This Video


Download

  
Report form