One Nation-One Election : BJP Prepare For Polls

Oneindia Telugu 2018-03-01

Views 96

Narendra Modi with Chief Ministers of the BJP-ruled states discussed the issue of having simultaneous polls in The meeting. At the meeting, the PM advised the CMs to create a public awareness about holding simultaneous elections.

కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలని ప్రధాని నరేంద్ర మోడీ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నికల నినాదంతో లోక్ సభ, అన్ని రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు నిర్వహించడానికి సిద్దం కావడానికి బీజేపీ నాయకులు ఢిల్లీలో సమావేశం అయ్యి సుధీర్ఘంగా చర్చించారు.
భారతదేశంలోని ఒక్కోరాష్ట్రంలో ఒక్కొసారి ఎన్నికలు జరుగుతున్నాయని ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
పలు రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు జరిగే సమయంలో ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని, ఆ సమయంలో ఆ రాష్ట్రాల్లో కేంద్రం అభివృద్ది పథకాలు అమలు చెయ్యడం సాధ్యం కావడంలేదని బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నాయులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
లోక్ సభ, శాసన సభ ఎన్నికలు ఒకే సారి జరిగితే ఎన్నికల నియమావళి అందరికీ అమలులో ఉంటుందని, అలాంటి సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని, కేంద్రంలోని అభివృద్ది పథకాలు అమలు చెయ్యడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లోక్ సభతో పాటు శాసన సభ ఎన్నికలకు సిద్దంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా సూచించారని తెలిసింది. లోక్ సభ ఎన్నికలతో పాటు, శాసన సభ ఎన్నికలు ఒకే సారి జరిగితే బీజేపీకి ఎక్కువ లాభం ఉంటుందని అంచనా వేశారని సమాచారం.
ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫెడ్నవీస్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సహ బీజేపీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS