"Boney ‘s mother portrayed Sridevi as a home breaker and publically beated her in the stomach in a five star hotel lobby for what she did to Boney’s first wife Mona" Ram Gopal Varma's letter said.
శ్రీదేవిని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆరాధించినంతగా ఇంకెవరూ ఆరాధించి ఉండరేమో. తన దేవత మరణించిన విషయాన్ని వర్మ తట్టుకోలేక పోతున్నారు. శ్రీదేవి మరణవార్త విన్న వెంటనే తన బాధను వర్మ వరుస ట్వీట్ల రూపంలో వ్యక్తి పరిచాడు. తాజాగా మై లవ్ లెటర్ టు శ్రీదేవి ఫ్యాన్స్ అంటూ ఆయన ఓ లేఖను విడుదల చేశారు. అందులో పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చారు వర్మ.
కోట్లాది మీలాంటి అభిమనుల్లానే నేను కూడా శ్రీదేవిని మోస్ట్ బ్యూటిఫుల్, డిజైరబుల్ ఉమెన్‌గా ఆరాధించాను. ఆమె ఈ దేశంలో అతిపెద్ద సూపర్ స్టార్ అని, 20 ఏళ్ల పాటు సిల్వర్ స్క్రీన్‌ను రారాణి లాగా ఏలిందని మనందరికి తెలుసు..... అని వర్మ తన లేఖలో పేర్కొన్నారు.
శ్రీదేవి మరణంపై వెనక వినిపిస్తున్న వార్తలతో రామ్ గోపాల్ వర్మ కూడా చాలా దిగ్బ్రాంతికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె జీవితం మాదిరిగానే.... ఆమె మరణం కూడా చాలా మిస్టీరియస్‌గా ఉందనే అభిప్రాయాన్ని రామ్ గోపాల్ వర్మ తన లేఖలో పేర్కొన్నారు
చాలా మంది శ్రీదేవి జీవితం పర్‌ఫెక్ట్ అని భావిస్తుంటారు. అందమైన ముఖం, గ్రేట్ టాలెంట్, ఇద్దరు కూతుళ్లతో మంచి ఫ్యామిలీ..... బయటి నుండి చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. కానీ శ్రీదేవి హ్యాపీ లైఫ్ లీడ్ చేసిందా? అంటే చెప్పాల్సింది చాలా ఉంది అంటూ వర్మ కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు.
బోనీ కపూర్ తల్లి శ్రీదేవిని ఇష్టపడలేదు. ఆమె వల్ల తన ఇల్లు ముక్కలవుతుందని చిత్రీకరించింది. శ్రీదేవిని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లాబీలో పబ్లిగ్గా కడుపులో కొట్టింది. ఇదంతా ఆమె బోనీ కపూర్ మొదటి భార్య మోనా కోసమే చేసింది.... అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.