Dubai Police has handed over the Consulate and the family members letters for the release of the mortal remains of the Indian cinema icon Sridevi Boney Kapoor so that they can proceed for embalming. The mortal remains of Bollywood actor Sridevi are expected to reach India on Tuesday.
దుబాయ్‌లో శ్రీదేవి మృతదేహం అప్పగింత, తరలింపు అంశాలకు సంబంధించి తీవ్ర ఊగిసలాటకు తెరపడింది. శ్రీదేవి మృతదేహాన్ని అప్పగించేందుకు దుబాయ్ పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. మంగళవారం ఏ సమయానికైనా మృతదేహాన్ని అప్పగిస్తామని చెప్పినప్పటికీ క్లారిటీ కనిపించడంతో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ గందరగోళం కొనసాగుతుండగానే బోని కపూర్ కుమారుడు అర్జున్ కపూర్ దుబాయ్‌కి ప్రయాణం కావడం అనేక సందేహాలను రేకెత్తించింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కాన్సులేట్ అధికారులకు దుబాయ్ పోలీసులు అనుమతుల పత్రాలను అందించారు. దాంతో శ్రీదేవి మృతదేహానికి ఎంబల్మింగ్‌కు మార్గం సుగమమైంది.
శ్రీదేవి కుటుంబానికి చెందిన ఇద్దరు, భారతీయ కాన్సులేట్‌కు సంబంధించిన ముగ్గురు అధికారులు దుబాయ్ పోలీస్ స్టేషన్ వద్ద ఉదయం కనిపించారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు 11.30 గంటల ప్రాంతంలో నిరాశతో తిరిగి వెళ్లిపోయారు
ఇదిలా ఉండగా, అనేక ఊహాగానాల మధ్య బోనికపూర్ కుమారుడు అర్జున్‌కపూర్ దుబాయ్‌కి బయలుదేరి వెళ్లాడు. తన తండ్రికి అండగా ఉండటానికి వెళ్లినట్టు చెప్పినప్పటికీ అర్జున్ వెళ్లడం అనేక అనుమానాలకు తావిచ్చింది.
ఇక శ్రీదేవి మరణం సహజం అనుకొన్నప్పటికీ అది వివాదంగా మారడం, ఆ వ్యవహారంలో బోనికపూర్ వైపు అనేక అనుమానాలు తలెత్తడంతో ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ఈ కేసులో బోని కపూర్ వాగ్మూలాన్ని దుబాయ్ సేకరించిన నేపథ్యంలో ఆయన అరెస్ట్ తప్పదంటూ వార్తలు వచ్చాయి.
ఒకవేళ సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో శ్రీదేవి మృతదేహాన్ని తరలిస్తే రాత్రి 10 గంటల తర్వాత ప్రత్యేక విమానం ముంబైకి చేరుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే పలువరు సినీ ప్రముఖులు, అభిమానులు శ్రీదేవిని కడసారి దర్శించుకొనేందుకు వేచిచూస్తున్నారు.