In a moving gesture, Indian industrial magnate Anil Ambani has sent an aircraft to Dubai to bring back Bollywood actress Sridevi to India later on Sunday, sources said.
దుబాయ్‌లో మృతి చెందిన శ్రీదేవి మృతదేహాన్ని తీసుకు వచ్చేందుకు అనిల్ అంబాని ప్రత్యేక జెట్ విమానాన్ని ఏర్పాటు చేశారు. సమాచారం మేరకు ఆయన ఓ జెట్ విమానాన్ని పంపించారు.
రిలయెన్స్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ ట్రావెల్ లిమిటెడ్‌కు చెందిన 13 సీట్లు కలిగిన ప్రయివేటు (Embraer-135BJ) జెట్‌ను పంపించారు. ఈ విమానం ముంబై నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో దుబాయ్‌కి బయలుదేరింది.
శ్రీదేవి భౌతిక కాయాన్ని దుబాయిలోని డాక్టర్లు ఇంకా కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. దాదాపు ఇరవై గంటలు గడిచినా ఆమె పార్థివ దేహం ఆసుపత్రిలోనే ఉంది. పోస్టుమార్టం పేరుతో డాక్టర్లు కాలయాపన చేస్తున్నారని తెలుస్తోంది. ఇంకా పోస్టుమార్టం చేయలేదు. శ్రీదేవి మృతదేహం సోమవారం వచ్చే అవకాశముంది.
మరికొన్ని పరీక్షలు అవసరమంటూ డాక్టర్లు చెబుతున్నారని తెలుస్తోంది. శవపరీక్ష అనంతరం ఆమె భౌతిక కాయాన్ని ముహైస్నా ఎంబాల్మింగ్ సెంటర్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి ప్రయివేటు జెట్‌లో ముంబై తరలించనున్నారు.
తల్లి మృతితో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ తల్లడిల్లుతున్నారు. పెళ్లి కోసం శ్రీదేవి, బోనీకపూర్, చిన్న కూతురు ఖుషీ దుబాయ్ వెళ్లారు. అక్కడ శ్రీదేవి మృతి చెందారు. జాన్వి దఢక్ సినిమా షూటింగ్ కోసం ముంబైలోనే ఉన్నారు. దాదాపు అందరు బంధువులు పెళ్లి వేడుకల కోసం దుబాయ్‌కు వెళ్లారు. దీంతో జాన్వి ఇంట్లో ఒక్కరే ఉన్నారని తెలుస్తోంది.
తల్లి మరణవార్త విన్న జాన్వీ కుప్పకూలిపోయారు. ఇలాంటి సమయంలో ఆమెకు ధైర్యం చెప్పడానికి దర్శక, నిర్మాత కరణ్‌జోహార్ లోఖండ్‌వాలాలోని శ్రీదేవి ఇంటికి వెళ్లారు. ఆమెను జూహూలోని అనిల్ కపూర్ ఇంటికి తీసుకెళ్లారు.