Mauritius drags Modi to international court over Jagan's case

Oneindia Telugu 2018-02-22

Views 1.1K

The Mauritius government has dragged modi to the International Court of Justice for arbitration in the InduTech Zone Investments case.InduTech Zone IT SEZ had failed to take off after CBI chargesheeted Andhra opposition leader Jagan Mohan Reddy in a scam.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు భారత్‌ను అంతర్జాతీయ కోర్టుకు లాగింది. ఇందు టెక్ జోన్ ఇన్వెస్ట్‌మెంట్ కేసులో న్యాయం చేయాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కోరుతూ మారిషస్ ప్రభుత్వం భారత్‌ను లాగింది. ఇందూ టెక్ జోన్ ఐటి సెజ్ కేసుతో తాము పెద్ద యెత్తున నష్టపోయామని చెబుతూ న్యాయం చేయాలని కోరుతూ మారిషస్ ప్రభుత్వం నెదర్లాండ్స్‌లోని అర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించింది.
ప్రధాని నరేంద్ర మోడీతో సహా కొంత మంది మంత్రులకు నోటీసులు పంపించింది. ఇందూ టెక్ జోన్ ఐటి సెజ్ కేసులో జగన్, శ్యాంప్రసాద్ రెడ్డి సహా పలువురిపై సిబిఐ చార్జీషిట్ దాఖలు చేసింది. దాంతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది.
ఇందూ టెక్ జోన్‌లో మారిషస్‌కు 49 శాతం వాటా ఉంది. ఐటి సెజ్ కోసం మారిషస్‌కు చెందిన రకీసా ఇన్వెస్ట్‌మెంట్స్ రూ.115 కోట్లు పెట్టుబడి పెట్టింది. తొలి విడత రూ.1.18 కోట్లు, రెండో విడ రూ.14 కోట్లు, మూడో విడత రూ.99 కోట్లు పెట్టుబడిగా పెట్టింది.
సిబిఐ కేసుతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. దాంతో తమకు భారీ నష్టం వాటిల్లిందని, తమకు 50 మిలియన్ డాలర్ల నష్టపరిహారం ఇప్పించాలని మారిషస్ ప్రభుత్వం నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం మెట్లు ఎక్కింది. మోడీకి నోటీసులు పంపించడమే కాకుండా కేంద్ర ఆర్థిక, వాణిజ్య, న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులను ప్రతివాదులుగా చేర్చింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS