Jagan Padayatra : Heavy Crowd In Jagan's Public Meet At Yerraguntla | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-10

Views 2.1K

Minister Adi Narayana Reddy got shocked after seeing the crowd in Jagan's public meet in Yerraguntla

పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్టీ ఫిరాయించిన నేతలను వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించేలా జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను ప్లాన్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. గురువారం నాడు జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర సందర్భంగా మంత్రి ఆది నారాయణరెడ్డి మీద వైసీపీ నాయకుడు డాక్టర్ సుధీర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన విమర్శలకు జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడం గమనార్హం.
మంత్రి ఆదినారాయణ రెడ్డి వైసీపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఆపై టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన వియ్యంకుడు కేశవరెడ్డి విద్యా సంస్థల వ్యవహారం కూడా వివాదాస్పదమవడంతో.. ఆ విషయంలో ప్రభుత్వ అండదండలు అవసరమవడంతోనే ఆయన టీడీపీతో కుమ్మక్కయ్యారని ప్రతిపక్షం విమర్శిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను దెబ్బకొట్టడానికి ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గురువారం ప్రజా సంకల్పయాత్రలో ఆది నారాయణ రెడ్డికి సెగ తగిలేలా పలువురు ఘాటు విమర్శలతో విరుచుకపడ్డారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS