Rashi Khanna responds on rumors related to Anil Ravipudi. Rashi shocked with that rumor.
చిత్ర పరిశ్రమలో పుకార్ల బెడద ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అవి శృతి మించిన సమయంలో సదరు సెలెబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి సమస్యలే క్రేజీ హీరోయిన్ రాశి ఖన్నాకు కూడా ఎదురయ్యాయి. రాశి ఖన్నా, దర్శకుడు అనిల్ రావిపూడి గురించి కొన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. వాటి గురించి రాశి ఖన్నా ఘాటుగానే స్పందించింది. అందులో ఎలాంటి వాస్తవం లేదని అనిల్ తనకు మంచి స్నేహితుడని తేల్చేసింది.
సాయిధరమ్ తేజ్ నటించిన సూపర్ హిట్ చిత్రం సుప్రీంలో రాశి ఖన్నా హీరోయిన్. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. సుప్రీంలో అనిల్ రావిపూడి.. తేజు, రాశి ఖన్నా మధ్య కెమిస్ట్రీని అద్భుతంగా ఆవిష్కరించారు.
రవితేజ నటించిన బెంగాల్ టైగర్ చిత్రంలో కూడా రాశి నటించింది. ఆ చిత్రంలో రాశి గ్లామర్ షో యువతని ఆకట్టుకుంది.
ఇటీవల అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం రాజా ది గ్రేట్. రవితేజ అంధుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో రాశి ఖన్నా స్పెషల్ సాంగ్ లో ఉచితంగా చేసిందంటూ వార్తలు వచ్చాయి.
అందువల్లనే రాశి ఖన్నా, అనిల్ రావిపూడి మధ్య ఏదో జరుగుతోదంటూ పుకార్లు మొదలయ్యాయి.
వెల్లువలా వస్తున్న పుకార్ల గురించి రాశి ఖన్నా ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో ఈ వార్తల గురించి స్పందించింది. అందులో ఎలాంటి వాస్తవం లేదని , అది స్టుపిడ్ రూమర్ అని ఫైర్ అయింది.
తాను అనిల్ రవి పూడి దర్శకత్వంలో సుప్రీం చిత్రంలో నటించానని , దర్శకుడు అనిల్ రవి పూడి నాకు మంచి స్నేహితుడుని, రవితేజ కూడా తనకు స్నేహితుడని అందువల్లనే స్పెషల్ సాంగ్ చేసినట్లు రాశి క్లారిటీ ఇచ్చింది.