Priya Prakash Warrier memes and Spoofs

Oneindia Telugu 2018-02-14

Views 2

Malayalam actress Priya Prakash Varrier Memes & Jokes, Spoofs Are Going Viral. The best of the lot feature Varrier’s shots from the viral video intercut with shots of personalities such as Prime Minister Narendra Modi and United States President Donald Trump.

ప్రియా వారియర్.. పేరుకు తగ్గట్టే కుర్రకారు గుండెలపై పెద్ద వార్ ప్రకటించింది. కను సైగలతో ఆమె పలికించిన హావభావాలు యువతను పిచ్చి పిచ్చిగా ఫిదా చేశాయి. ప్రియా చూపులు నేరుగా తమ గుండెల్లోనే గుచ్చుకున్నట్టు ఫీలైపోతున్నారు యువత.
ఇంతలా మాయ చేసిన ప్రియా వారియర్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ హాట్ టాపిక్. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ.. అంతా ఆమె గురించే చర్చ. ఈ నేపథ్యంలో స్పూఫ్ వీడియోలు కూడా చాలానే బయలుదేరాయి. రాజకీయాల నాయకులకు ప్రియా సైట్ కొడుతున్నట్టుగా క్రియేట్ చేసిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి
ప్రియా వారియర్ స్పూఫ్ వీడియోల్లో అన్నింటికంటే హైలైట్ రాహుల్ వీడియోనే అని చెప్పాలి. ప్రియా కన్ను గీటితే.. ముసిముసి నవ్వులతో లోలోపలే సంబరపడుతున్నట్టుగా కనిపిస్తున్న ఆ వీడియో నెటిజెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ప్రధానమంత్రి మోడీని కూడా వదల్లేదు నెటిజెన్స్. ప్రియా కన్నుగీటితే.. పీఎం అయినా సరే వయసు మరిచిపోవాల్సిందే అన్నట్టుగా వీడియోను రూపొందించారు. ప్రియా సైట్ కొట్టగానే.. మోడీ చిన్నగా నవ్వుతూ మురిసిపోయిన వీడియో ఇప్పుడు తెగ హల్‌చల్ చేస్తోంది.
ఇక అసలే స్త్రీ లోలుడిగా ముద్రపడ్డ ట్రంప్ ను సైతం ఈ స్పూఫ్ వీడియోల్లోకి లాగేశారు. ట్రంప్ ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ కు.. ప్రియా వారియర్ కను సైగల వీడియోను జతచేసి యూట్యూబ్ లో వదిలారు. ఈ వీడియో కూడా నెటిజెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Share This Video


Download

  
Report form