Jagan Media Blames Pawan Kalyan

Oneindia Telugu 2018-02-12

Views 1.5K

YS Jagan's Sakshi media has published an article that blaming Jana Sena chief Pawan Kalyan.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరాటానికి తెర తీసేందుకు ప్రయత్నిస్తున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై సాక్షి మీడియా ఆసక్తికరమైన వార్తాకథనాన్ని ప్రచురించింది. కాలయాపనా... కాపాడే వ్యూహమా అనే శీర్షిక పెట్టిన ఆ వార్తాకథనాన్ని ప్రచురిచింది.
సాక్షి మీడియా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిదనే విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర నిధుల అంశంపై శ్వేత పత్రం విడుదల చేయాలని పవన్ కల్యాణ్ రెండు ప్రభుత్వాలను అడగడమంేట కాలయాపన చేయడానికే, మిత్ర పక్షాలను కాపాడడానికే అని సాక్షి మీడియా ప్రశ్నించింది.
కేంద్రం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వంం ఎంతు పుచ్చుకుంది తనకు లెక్కలు చెప్పాలని పవన్ కల్యాణ్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ తర్వాత మీడియాతో అన్నారు. వాటిలో వాస్తవాలేమిటో నిజ నిర్ధారణ కమిటీతో అధ్యయన చేయిస్తానని ఆయన చెప్పారు.
పవన్ కల్యాణ్ మాటలపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నరని, తాము ఇంత ఇచ్చామని కేంద్రం, కాదు ఇంతే పుచ్చుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా ఇంకా లెక్కలు ఇవ్వాలని, నిజనిర్దారణ కమిటీతో పరిశీలింపజేస్తానని పవన్ కల్యాణ్ అనడమంటే కాలయాపన చేయడానికి తప్ప మరోటి కానే కాదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయని సాక్షి, వ్యాఖ్యానించింది.
విభజన తర్వాత రాష్ట్రం నిలదొక్కుకోవాలన్నా, శాశ్వత అభివృృద్ధికి అడుగులు పడాలన్నా, యువతకు భవిత ఉండాలన్నా ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని ప్రజలంతా ముక్తకంఠంతో చెబుతున్నా ప్రత్యేక ప్యాకేజీ పేరిట కమీషన్ల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చంద్రబాబును ఇప్పటి వరకు నిలదీయలేకపోయారని పవన్ కల్యాణ్‌ను పలువురు ప్రశ్నిస్తున్నారని సాక్షి డైలీ రాసింది.
ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు అన్నప్పుడే పవన్ ప్రశ్నించకపోవడంలోని ఔచిత్యం ఏమిటని సాక్షి ప్రశ్నించింది. వారి మధ్య ఉన్న అవగాహన ఏపాటిదో తెలిసిపోయిందని తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకర వ్యాఖ్యానించినట్లు సాక్షి రాసింది.

Share This Video


Download

  
Report form