Virat Kohli a Complete Cricketer and Role Model for every cricketer

Oneindia Telugu 2018-02-09

Views 39

Kohli is a treat to watch. At times when you do think or imagine if I was young and playing against Virat Kohli where would I bowl and I do feel it would be a bit difficult to bowl at him says Wasim Akram

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 'కంప్లీట్ ప్లేయర్' అయ్యాడని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీమ్ అక్రమ్ అన్నాడు. సఫారీ గడ్డపై కోహ్లీసేన సాధిస్తోన్న విజయాలను ప్రపంచంలోని పలు విదేశీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు. ఇక, కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ (160 నాటౌట్) క్లాసిక్ ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. మూడు ఫార్మాట్లలో కోహ్లీ కనబరుస్తున్న ప్రదర్శనపై, అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ చెలాయిస్తోన్న ఆధిపత్యాన్ని వసీం అక్రమ్ ప్రత్యేకంగా కొనియాడాడు. టీమిండియా కోహ్లీ ముందుండి నడిపించడంతో పాటు అతడి ప్రతి ఇన్నింగ్స్ ఓ ట్రీట్‌లాగా ఉందని అక్రమ్ పొగడ్తలతో ముంచెత్తాడు.
ఎలాంటి పిచ్ అయినా సరే కోహ్లీ చెలరేగుతున్నాడు, ఎందుకంటే అతడు కంప్లీట్ ప్లేయర్ కాబట్టి. ప్రపంచ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ తర్వాత కోహ్లీ టర్న్ వచ్చింది అని అనుకుంటున్నా. అది లీడర్‌ని బట్టి డిసైడ్ అవుతుంది. జట్టుని ముందుండి నడిపిస్తున్నాడు. అతడొక సుప్రీమ్ అథ్లెట్. ప్రతి మ్యాచ్‌లో కూడా అతడు పరుగులు సాధిస్తున్నాడు' అని పేర్కొన్నాడు.
'ఫస్ట్ ఇన్నింగ్స్, రెండో ఇన్నింగ్స్, టెస్టు మ్యాచ్, వన్డేలు, టెస్టులు ఇలా... కోహ్లీ ఒక్క భారత్‌కే రోల్ మోడల్ కాదు, యావత్ ప్రపంచంలోని క్రికెటర్లకు రోల్ మోడల్. ఏ జట్టుకైనా ఓ మంచి కోచ్ ఉండటం ఎంతో ముఖ్యం. కోచ్‌గా రవిశాస్త్రి చాలా చక్కగా తన బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. శాస్త్రి బాగా కష్టపడతాడు. రిలాక్స్ అయిన సందర్భంలో ఎంతో ఎంజాయ్ చేస్తాడు. తన జట్టులో కూడా అదే భావాన్ని నింపుతున్నట్లు ఉన్నాడు' అని అక్రమ్ తెలిపాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS