Pictures of Katrina Kaif rehearsing her steps for the title song of Thugs Of Hindostan made all of us eager to see more of her in the film.
కెరీర్ తొలినాళ్లతో పోలిస్తే కత్రినా కైఫ్ నటన పరంగా, డాన్సింగ్ స్కిల్స్ పరంగా చాలా ఇంప్రూవ్ అయింది. ఆకట్టుకునే అందం కూడా ఉండటంతో అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా కత్రినా డాన్సింగ్ స్కిల్స్ ప్రేక్షకులను అనేక సందర్భాల్లో అబ్బుర పరిచాయి. కొన్ని పాటల్లో కత్రినా దమ్ము దులిపింది. మరోసారి స్పెషల్ సాంగులో కత్రినా కైఫ్ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతోంది.
ప్రస్తుతం కత్రినా కైఫ్ 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కత్రినా అదిరిపోయే డాన్స్ నెంబర్ చేస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.
లీకైన ఫోటోలు చూసిన ఫ్యాన్స్ కత్రినా కైఫ్ లుక్ స్టన్నింగ్‌గా ఉందని అంటున్నారు. ఆమె మరోసారి శీలాకి జవాని, చికినీ చమేలీ, చాలా చస్మా తరహాలో ఎంటర్టెన్ చేస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' చిత్రంలో రెండు బిగ్ ఈవెంట్ సాంగ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ రెండు పాటల్లోనూ కత్రినా ఉంటుందట. ఒక పాటలో కత్రినాతో పాటు అమీర్ కూడా ఉంటారని సమాచారం. పహాడీ డాన్స్ నెంబర్‌తో సాగే ఓ పాటను ఆల్రెడీ చిత్రీకరించారు. కత్రినా మాత్రమే ఉండే పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా డాన్స్ కంపోజ్ చేశారు. జనవరిలో దాదాపు వారంరోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారట.