The state-wide bandh called by the Left parties to protest against the anti-Andhra Union Budget 2018 evoked good response in the Andhra Pradesh, particularly Vizag city.
కేంద్ర బడ్జెట్‌లో ఏపీ రాష్ట్రానికి అరకొర కేటాయింపులను నిరసిస్తూ వామపక్షాలు ఫిబ్రవరి 8 న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి.ఈ బంద్‌కు బిజెపియేతర పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. ఏపీ రాష్ట్రంలోని బిజెపి నేతల ఇళ్ళ వద్ద, ఆ పార్టీ కార్యాలయాల ఎదుట ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ ఈ బంద్‌కు మద్దతు ప్రకటించారు. మరోవైపు టిడిపి కూడ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది.ఈ బంద్‌ను పురస్కరించుకొని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రను నిలిపివేశారు.
గురువారం ఉదయం నుంచే వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగాయి. పలు ఆర్టీసీ డిపోల ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కాగా, తిరుమలకు వెళ్లే బస్సులకు మాత్రం నిరసనకారులు మినహాయింపునిచ్చారు. గుంటూరు, విశాఖపట్నంలలో బంద్ సంపూర్ణంగా సాగుతోంది. విశాఖ ఏజెన్సీలో బుధవారం సాయంత్రం 6గంటల వరకు 144సెక్షన్ విధించారు.
నిరసనకారులు బస్సులను నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.
విద్యా, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ప్రభుత్వం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. టీడీపీ నేతలు కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసన శాంతియుత ర్యాలీలు చేపడుతున్నారు