IND v SA 3rd ODI : How India Performed Historically At Newlands Stadium

Oneindia Telugu 2018-02-07

Views 111

The visitors won the first two matches of the series in Durban and Centurion by six and nine wickets, respectively, dismantling the home side with consummate ease.

సుదీర్ఘమైన సఫారీ పర్యటన కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా డిసెంబర్ 2017న బయల్దేరింది. స్వదేశంలో వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న కోహ్లీసేన సఫారీ గడ్డపై టెస్టు సిరిస్‌ను గెలిచి చరిత్ర సృష్టిస్తుందని అంతా భావించారు. అయితే అనూహ్యాంగా 1-2తో సిరిస్‌ను కోహ్లీసేన చేజార్చుకుంది.
ఆ తర్వాత ఇరు జట్ల మధ్య ఆరు వన్డేల సిరిస్ ప్రారంభమైంది. అయితే టెస్టు సిరిస్‌ను కోల్పోయిన టీమిండియాకు వన్డే సిరిస్ ఊరటనిచ్చింది. వరుసగా రెండు వన్డేల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో నిలిచింది. ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య బుధవారం కేప్ టౌన్ వేదికగా మూడో వన్డే జరగనుంది.
ఇప్పటికే ఈ సిరిస్‌లో కోహ్లీసేన 2-0తో ఆధిక్యంలో నిలిచింది. బుధవారం జరిగే మూడో వన్డేలో గనుక కోహ్లీ సేన విజయం సాధిస్తే, సఫారీల గడ్డపై ఓ ద్వైపాక్షిక సిరిస్‌లో వరుసగా మూడు వన్డేల్లో విజయం సాధించిన జట్టుగా కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుంది. సెంచూరియన్ వేదికగా రెండో వన్డేలో కోహ్లీసేన విజయం సాధించడంతో కెప్టెన్‌గా కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు.
ఆరు వన్డేల సిరిస్‌కు ముందు ఐసీసీ ర్యాంకుల్లో భారత్ రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో వరుసగా రెండు విజయాలను నమోదు చేయడంతో ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానానికి ఎగబాకింది. దీంతో దక్షిణాఫ్రికా రెండో స్థానానికి దిగజారింది. ఈ సిరిస్‌ను 4-2తో కోహ్లీసేన కైవసం చేసుకుంటే వన్డేల్లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటుంది.
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన మూడో టెస్టులో కోహ్లీసేన విజయం సాధించడంతో సఫారీ గడ్డపై వరుసగా మూడు విజయాలను సాధించిన జట్టుగా కూడా కోహ్లీసేన నిలిచింది. 1992 నుంచి సఫారీ గడ్డపై టీమిండియా ఒక్క ద్వైపాక్షిక(వన్డే, టెస్టు) సిరిస్‌ను గెలవలేదు. అయితే ఈసారి కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా చరిత్రను తిరిగరాసేలా కనిపిస్తోంది.

Share This Video


Download

  
Report form