Undavalli Arun Kumar Fires On Centre Over Arun Jaitley's Budget and Undavalli Arun Kumar made Sensational Comments On Chandrababu
సోమవారం రాజమహేంద్రవరంలో ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ వెల్‌లోకి టీడీపీ ఎంపీలు పోరాటం చేస్తే ఏం ప్రయోజనం లేదని అన్నారు.
ఆంధ్రాకు ఏమిచ్చినా.. కాంట్రాక్టర్ల కోసమే కానీ.. ప్రజల కోసం కాదన్న అభిప్రాయం కేంద్రంలో ఉందని ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కేంద్రంతో పోరాటానికి ఇంకా అవకాశం ఉందని, నేరుగా పోరాటం చేయాలని సూచించారు.ఇక కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఉండవల్లి పెదవి విరిచారు. రైతులకు గిట్టుబాటు ధర శుద్ధ అబద్ధమని ఆయన అన్నారు. వైద్యానికి ఐదు లక్షల బీమా పథకంలో అర్థం పర్థం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు గత నాలుగేళ్లుగా బడ్జెట్ ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరిగిందని ఉండవల్లి చెప్పారు. విభజన చట్టంలో భాగంగా విశాఖలో పెడతామన్న రిఫైనరీని ఇప్పుడు ముంబైలో పెడుతుంటే ఏమనాలని ఉండవల్లి ప్రశ్నించారు.