Aishwarya Rai Rejects Abhishek Bachchan

Filmibeat Telugu 2018-02-05

Views 3.1K

Aishwarya Rai Bachchan and Abhishek Bachchan acted together in a movie 8 years back, in Mani Ratnam’s ‘Raavan’. Since then, the audiences haven’t heard that they will work together till a few years back, where they almost said yes to a project. But according to a report, Aishwarya opted out.

ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ ఇద్దరూ సినిమాల్లో కొనసాగుతూనే అన్యోన్యమైన దాంపత్యం సాగిస్తున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టే విధంగా బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్‌లో షాకింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐశ్వర్యరాయ్‌కు భర్తకంటే డబ్బే ఎక్కువైందని, ఆమె తీసుకున్న నిర్ణయం దారుణంగా ఉందని కొందరు విమర్శలు చేస్తున్నారు.
ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ కాంబినేషన్లో సినిమా వచ్చి దాదాపు 8 సంవత్సరాలు అవుతోంది. ఇద్దరూ కలిసి అప్పట్లో మణిరత్నం ‘రావన్' చిత్రంలో నటించారు. మళ్లీ ఈ జంట ఎప్పుడు కలిసి నటిస్తారో? అని అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలో శైలేష్ ఆర్ సింగ్ అనే దర్శకుడు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఐష్ మూలంగా ఈ ప్రయత్నం బెసిడికొట్టిందని, అందుకే ఈ రూమర్లు ప్రచారంలోకి వచ్చాయని టాక్.
ఫిల్మ్ మేకర్ శైలేష్ ఆర్ సింగ్ ఇటీవలే ఇద్దరినీ కలిసి స్క్రిప్టు వివరించారని.... స్క్రిప్టు విన్న వెంటనే అభిషేక్ బచ్చన్ సుముఖత వ్యక్తం చేసినా..... ఐశ్వర్యరాయ్ మాత్రం స్క్రిప్టులో మార్పులు చేయాలని కోరిందని టాక్.
ఐష్ కోరిక మేరకు సదరు దర్శకుడు కథలో మార్పులు చేసి ఐశ్వర్య రాయ్‌ను సంప్రదించగా అప్పటికే ఐశ్వర్యరాయ్ మరో చిత్రానికి సైన్ చేసిందని, సదరు చిత్రం వారు దాని కంటే ఎక్కువగా రూ. 10 కోట్లు రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో దానికే కమిటైందని టాక్.

Share This Video


Download

  
Report form