In his maiden speech in the Rajya Sabha, BJP president Amit Shah said it was better to sell 'pakodas' than to be unemployed.
పకోడీలు అమ్ముకుంటే తప్పేమిటని, అందులో సిగ్గు చేటయిన విషయం ఏముందని బిజెపి రాజ్యసభ సభ్యుడు అమిత్ షా ప్రశ్నించారు. రాజ్యసభలో ఆయన సోమవారం తొలి ప్రసంగం చేశారు. పకోడీలపై కాంగ్రెసు చేసిన విమర్శలను అమిత్ షా తిప్పికొట్టారు.
ఉద్యోగం ఏదీ చేయకపోవడం కన్నా పకోడీలు అమ్ముకోవడం మంచిదని ఆయన అన్నారు. రోడ్డుపై ఎవరైనా పకోడీలు అమ్ముకుని రూ.200 సంపాదిస్తే దాన్నే ఉద్యోగంగా భావించాలని మోడీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దానిపై కాంగ్రెసు విమర్సలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో అమిత్ షా ఆ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెసు పకోడా రాజకీయాలు చేస్తోందని అమిత్ షా అన్నారు. ఉద్యోగం చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అది సిగ్గుచేటు కాదని ఆయన అన్నారు. పకోడీలు అమ్ముకునేవారు అడుక్కోవడం లేదు కదా అని ఆయన అడిగారు. నిరుద్యోగిగా ఉండడం కన్నా కష్టపడడం తప్పు కాదని అమిత్ షా అన్నారు. అది ఏ మాత్రం సిగ్గుపడాల్సిన విషయం కాదని అన్నారు. ఒక పేదవాడుఇవాళ పకోడీలు అమ్ముకుంటే అతను తర్వాతి కాలంలో పారిశ్రామికవేత్త అయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు
చాయ్‌వాలా కుమారుడు ప్రధాని అయినప్పుడు ఏదైనా సాధ్యమేనని అమిత్ షా అన్నారు. కాంగ్రెసు ఈ దేశాన్ని 55 ఏళ్లు పాలించిందని, అనువంశిక పాలన సాగిందని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వ హయాం అంతా కుంభకోణాలమయమని ఆయన విమర్సించారు. కాంగ్రెసు హయంలో విధానపరమైన పక్షవాతం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.