Nadhiya has been offered a role to play in the NTR biopic. Reports are that the team has approached her to play the iconic politician Indira Gandhi, the former Prime Minister of India. this character is pivotal to the plot of the NTR biopic and the team wants a performance-oriented actor like Nadhiya to play the role
నందమూరి బాలకృష్ణ భుజానికి ఇటీవల సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర షూటింగ్‌లో బాలయ్య గాయాల బారిన పడ్డారు. ఇటీవల భుజం నొప్పి తిరగదోడటంతో ఫిబ్రవరి 3వ తేదీన సర్జరీ అవసరమైంది. ఈ నేపథ్యంలో తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
వాస్తవానికి బాలకృష్ణకు సర్జరీ ముందుగా ప్లాన్ చేయలేదు. నొప్పి భరించే స్థితిలో ఆయన లేకపోవడంతో టర్న రొటేటర్ కఫ్‌కు సర్జరీ చేయాల్సి వచ్చింది. ప్రముఖ వైద్యులు దీప్తి నందన్‌రెడ్డి, ఆశీష్ బాబుల్కర్ పర్యవేక్షణలో శనివారం సాయంత్రం సర్జరీ జరిగింది అని బాలకృష్ణ సన్నిహితులు పేర్కొన్నారు.
వాస్తవానికి బాలకృష్ణకు ముందే ఈ సర్జరీ జరుగాల్సింది. అయితే శాతకర్ణి తర్వాత వరుసగా పైసా వసూల్, జై సింహా చిత్రాలు చేయాల్సి రావడంతో సర్జరీ పలుమార్లు వాయిదా పడింది. జై సింహా తర్వాత నొప్పి పెరుగడంతో ఆపరేషన్ అనివార్యమైంది.
భుజానికి సర్జరీ తర్వాత బాలకృష్ణకు ఆరువారాలపాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉంది. దాంతో ఎన్టీఆర్ బయోపిక్ మరో ఆరువారాలపాటు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. త్వరలోనే బయోపిక్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.