TDP-YSRCP MPs Protest In Parliament

Oneindia Telugu 2018-02-05

Views 1

YSRCP is continuing its struggle for sanction of special category status to the state of AP. In demand for the sanction, YSRCP MPs are holding relentless agitation at the parliament. and TDP-YSRCP MPs gave notices to Lok Sabha speaker over Special Status for Andhra Pradesh on Monday.

బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని పార్లమెంటు వేదికగా పోరాడాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. ఈ మేరకు కార్యాచరణ చేపట్టింది. విభజన హామీలు నెరవేర్చేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ఎంపీలు తోట నర్సింహం, కేశినేని నాని, నిమ్మల కిష్టప్పలు లోకసభలో సభాపతి సుమిత్రా మహాజన్‌కు నోటీసులు ఇచ్చారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా నోటీసులు ఇఛ్చింది. ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ఎంపీలు నోటీసులు అందించారు. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ 184వ నిబంధన కింద ఈ నోటీసులు ఇచ్చారు. లోకసభ, రాజ్యసభ ప్రారంభమయ్యాక వైసీపీ, టీడీపీ ఎంపీలు సభలో నిరసన తెలిపారు. ఇతర విపక్షాలు కూడా పలు అంశాలపై నిరసన తెలిపాయి. లోకసభ రేపటికి, రాజ్యసభ రెండు గంటలకు వాయిదా పడింది.
మరోవైపు, తెలుగుదేశం పార్టీ ఎంపీలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అందుబాటులో ఉన్న కేంద్రమంత్రులను కలవాలని సూచించారు. విభజన హామీలపై చర్యలు చేపట్టేలా వారిని కోరాలని చెప్పారు. ఆదివారం ఎంపీలతో భేటీ అయిన సమయంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఎంపీలతో భేటీ సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా.. చంద్రబాబుకు ఫోన్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. వీటిని చంద్రబాబు ఖండించారు. అమిత్ షా ఫోన్‌ చేయలేదన్నారు. శివసేన అధ్యక్షుసలు ఉద్ధవ్ థాకరేతో తాను మంతనాలు సాగించినట్టుగా ఒక పత్రికలో వచ్చిన కథనాన్నీ ఆయన ఖండించారు. తాను ఆయనతో మాట్లాడలేదన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS