Parliament Proceedings : Disruptions by TDP MPs in both Houses

Oneindia Telugu 2018-02-08

Views 1.5K

Sonia Gandhi has interacted with the senior MPs of TDP. Sonia personally interacted with Kesineni Nani, Ram Mohan Naidu, Thota Narasimham to know the issues of AP and the things happening in AP.

టీడీపీ, వైసీపీ ఎంపీలు లోకసభలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని, విభజన హామీలపై నిర్దిష్ట కాలపరిమితి కావాలని నిరస వ్యక్తం చేశారు. ఎంపీలు వెల్లోకి వెళ్లారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ టీడీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసనలపై లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ శివప్రసాద్ తప్పెటగుళ్ల వేషధారణలో నిరసన తెలిపారు. ఆయన సభలో దానిని వాయించే ప్రయత్నం చేశారు.
లోకసభలో సుజనా చౌదరి మాట్లాడుతూ.. విభజన సమస్యలపై 15 రోజుల్లో ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఈ అంశంపై రెండు గంటల పాటు ప్రత్యేక చర్చకు అనుమతించాలని కోరారు. ఏపీ అనేక సమస్యలతో ఆందోళన చెందుతోందన్నారు. కేంద్రంలో మంత్రిగా ఉంటూ సహచర మంత్రికి సూచన చేస్తున్నానని చెప్పారు. దీనిపై కేంద్రమంత్రి అనంత్ కుమార్ స్పందించారు. విభజన సమస్యలపై కేంద్రం సానుకూలంగా ఉందని ఏపీ మంత్రులు, సభ్యులు గ్రహించాలని అనంత్ కుమార్ అన్నారు. ఏపీ ప్రజల ఆందోళనను, ఆవేదనను తాము అర్థం చేసుకున్నామని చెప్పారు. సుజనా చౌదరి లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. బడ్జెట్‌పై ప్రసంగం సమయంలో ఆర్థిక మంత్రి ఏపీ విభజన అంశాలపై మాట్లాడుతారని చెప్పారు.
అనంత్ కుమార్ మాట్లాడిన తర్వాత తిరిగి సుజన స్పందిస్తూ.. ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్ ప్రసంగం సమయంలో కచ్చితమైన హామీ ఇస్తే మా సహచరులు (టీడీపీ ఎంపీలు) ఆందోళనను విరమిస్తారని తేల్చి చెప్పారు. వచ్చే బడ్జెట్ సమావేశాల వరకు తాము సమయం ఇస్తామని కూడా సుజన చెప్పినట్లుగా తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS