తెలంగాణలో పవన్‌కు ఏం పని ? రేవంత్ రెడ్డి వల్లే !

Oneindia Telugu 2018-01-29

Views 179

Uttamkumar Reddy said that Janasena chief Pawan Kalyan has no big voting in Telangana. and he praised revanth reddy.

తెలంగాణలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు పెద్దగా ఓటింగ్ ఉండదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణతో పవన్‌కు ఏం సంబంధం లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన వారిని కెసిఆర్ పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ వ్యతిరేకుల్ని దగ్గరకు తీస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు. కెసిఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉద్యమాన్ని నిర్వహించనున్నట్టు ఉత్తమ్ చెప్పారు.
కెసిఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తాము తమ గళాన్ని విన్పిస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. కెసిఆర్ ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న చట్టం గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా గతంలో ఏ విధంగా మాట్లాడామో ఇప్పుడు కూడ అదే విధంగా మాట్లాడనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల తమ పార్టీ బలం మరింత పెరిగిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డితో పాటు టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి పీసీసీ కార్యవర్గంలో చోటు కల్పించే విషయమై ఎఐసిసి నాయకత్వం కసరత్తు చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS