'Bhaagamathie' Movie Review భాగమతి సినిమా రివ్యూ..!

Filmibeat Telugu 2018-01-26

Views 4

After Arundhati and Rudhramadevi, Anushka Shetty is back with yet another female-centric movie in the form of Bhaagamathie. The film, directed by G Ashok Malayalam actor Unni Mukundan, has paired up with her in the multilingual flick, which has Asha Sarath, Prabhas Sreenu, Dhanraj, Murali Sharma and others in the cast.

ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన బాహుబలి2 చిత్రం తర్వాత అందాల తార అనుష్క శెట్టి చేస్తున్న సినిమా భాగమతి. అత్యున్నత సాంకేతిక విలువలతో విభిన్నమై కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యూవీ క్రియేషన్ బ్యానర్‌పై రూపొందిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు జి అశోక్. గతంలో జీ అశోక్ పిల్లా జమీందార్, సుకుమారుడు చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. భాగమతి జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తెలుగు ఫిల్మీబీట్ పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్న సమీక్ష ఇదే.
చంచల (అనుష్క) ఓ ఐఏఎస్ అధికారి. మంత్రి ఈశ్వర ప్రసాద్ (జయకుమార్) వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తుంది. సామాజిక కార్యకర్త శక్తి (ఉన్ని ముకుందన్)తో ప్రేమలో పడుతుంది. రైతుల సంక్షేమం మంత్రి ఈశ్వర ప్రసాద్ చేపట్టిన ప్రాణధార ప్రాజెక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తుంది. కానీ ఓ కారణంగా ప్రియుడు శక్తిని కాల్చి జైలుకెళ్తుంది. జైలులో రిమాండ్‌లో ఉన్న చంచలను ఓ ఆపరేషన్ కోసం భాగమతి బంగ్లాకు తరలిస్తారు. ఈ క్రమంలో ఓ లక్ష్యం కోసం ఏకంగా మంత్రికి ఎదురుతిరుగుతుంది.
భాగమతి బంగ్లాలో చంచలకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? నిజాయితీపరుడైన మంత్రి ఈశ్వర ప్రసాద్‌కు ఎందుకు ఎదురు తిరిగింది? ప్రజా సంక్షేమం కోసం పాటుపడే మంత్రిని ఎందుకు చంచల ఎదురించాల్సి వచ్చింది? ప్రియుడు శక్తిని చంచల ఎందుకు షూట్ చేయాల్సి వచ్చింది. తన అనుకొన్న లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే భాగమతి చిత్ర కథ. రాజకీయాల్లో అవినీతి, వారసత్వ రాజకీయాలను ప్రక్షాళన చేయడం అనే పాయింట్‌తో ఫీల్ గుడ్‌గా సినిమా అనిపిస్తుంది. ఓ వైపు మంత్రి ఈశ్వర ప్రసాద్‌పై ప్రభుత్వం ఎదురుదాడికి దిగడం, ఆయనను ప్రజల నుంచి దూరం చేయడానికి చంచలను రంగంలోకి దించడంతో సినిమా ఓ మలుపు తిరుగుతుంది. భాగమతి బంగ్లాలో జరిగే సంఘటనలు థ్రిల్లింగ్ అనిపిస్తాయి. పలుమార్లు ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిసాయి. అనుష్క టాలెంట్‌ను మరోసారి గుర్తు చేసే విధంగా చక్కటి ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ప్రథమార్థాన్ని ముగిస్తాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS