IPL 2018 Cchedule : Change In Match Timings

Oneindia Telugu 2018-01-23

Views 50

The 11th edition of the Indian Premier League (IPL) will be held from April 7 to May 27 with the tournament opener and final to be played in Mumbai.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ షెడ్యూల్ ఖరారైంది. తాజా షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం అర్ధరాత్రిదాకా మేల్కొని ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాయంత్రం 4 గంటల మ్యాచ్‌ల సమయాన్ని 5.30 గంటలకు, రాత్రి 8 గంటలకు జరిగే మ్యాచ్‌లను 7 గంటలకే మార్చారు.
ఐపీఎల్ 11వ సీజన్‌ నుంచి ఐదేళ్ల కాలానికి ఐపీఎల్‌ ప్రసార హక్కుల్ని సొంతం చేసుకున్న స్టార్‌ స్పోర్ట్స్‌ సంస్థ కోరిక మేరకే మ్యాచ్‌ సమయాన్ని మారుస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా వెల్లడించాడు. 'స్టార్ నెట్‌వర్క్ కోరినట్లు మ్యాచ్‌ వేళల్ని మార్చడానికి పాలకమండలి అంగీకరించింది. రోజుకు రెండు మ్యాచ్‌లు జరిగేది వారాంతాల్లో మాత్రమే. ఆ రెండు రోజులు ఒక మ్యాచ్‌కు ఇంకో మ్యాచ్‌ అడ్డం పడినప్పటికీ, వేర్వేరు ఛానెళ్లలో ఒకేసారి మ్యాచ్‌లు చూపించే సౌలభ్యం తమకుందని స్టార్ నెట్ వర్క్ చెప్పింది' అని శుక్లా తెలిపాడు.
పదేళ్ల పాటు సాఫీగా సాగిన ఐపీఎల్‌లో ఇప్పటివరకు సాయంత్రం మ్యాచ్‌ 4 గంటలకు.. రాత్రి మ్యాచ్‌ 8 గంటలకు జరిగిన సంగతి తెలిసిందే. అయితే 11వ సీజన్‌లో రాత్రి మ్యాచ్‌ను ముందుకు జరిపి 7 గంటలకే మొదలుపెట్టనున్నారు. నిజానికి ఈ ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. ఇందుకు కారణం కూడా ఉంది. రాత్రి 8 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌ ముగియడానికి దాదాపు 11.30 అవుతుంది. ఆ సమయంలో స్టేడియాల నుంచి ప్రేక్షకులు ఇంటికి వెళ్లడం ప్రధాన సమస్యగా మారింది. మరికొన్ని మ్యాచ్‌లు అయితే ఆలస్యమై అర్ధరాత్రి తర్వాత ముగుస్తుంటాయి. దీంతో రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభిస్తే ప్రైమ్‌ టైంలో ప్రసారదారుకి లబ్ధి చేకూరడంతో పాటు వీక్షకుల సంఖ్య కూడా పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Share This Video


Download

  
Report form