Telangana CM K Chandrasekhar Rao is far above TPCC president Uttam Kumar Reddy and senior Congressman K Jana Reddy when it comes to Google searches.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గూగుల్ సెర్చ్‌లో తన తనయుడు, తెలంగాణ మంత్రి కెటి రామారావును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధిగమించారు. కాంగ్రెసు పార్టీలోని అందరు నాయకుల మీద కేసిఆర్‌దే పైచేయిగా ఉంది.
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత జానా రెడ్డి కన్నా గూగుల్ సెర్చ్‌లో కేసీఆర్ ముందంజలో ఉన్నారు. కెసిఆర్ కిట్‌ను ఎక్కువ మంది సెర్చ్ చేశారు. ఆ తర్వాత స్థానం కేసీఆర్ బతుకమ్మ చీరలది, కెసిఆర్ అమ్మ ఒడిది. అయితే గత 12 నెలల కాలంలోని సెర్చ్ అంచనాలు ఇవి.
హైదరాబాదు, సికింద్రాబాదు జంటనగరాల్లో మాత్రం కేసిఆర్ కన్నా కేటీఆర్ గూగుల్ సెర్చ్ పాపులర్‌గా నిలిచారు. కెసిఆర్ మనవడి గురించి, ఆయన కూతురు గురించి, ఆయన కుటుంబ సభ్యుల గురించి ఎక్కువ నెటిజన్లు సెర్చ్ చేశారు.
ఇంటరెస్టు బై సిటీ ఫర్ కేసిఆర్ అనేది గూగుల్ ట్రెండ్స్‌లో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాలు కరీంనగర్, నిజామాబాద్, హనుమకొండ, సికింద్రాబాదు, హైదరాబాద్ ఆక్రమించాయి. కేసీఆర్ స్పీచ్ అనేది గూగుల్ ఫైవ్ టాప్ టర్మ్స్ చోటు చేసుకుంది. విజయవాడ, విశాఖపట్నంల నుంచి కేసీఆర్ కులం గురించి సెర్చ్ చేశారు.
కాంగ్రెసు నాయకుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిల కన్నా రేవంత్ రెడ్డి పైస్థానంలో ఉన్నారు. కేటీఆర్‌కు సంబంధించి కేటీఆర్ విద్య, కుటుంబం, వాట్సప్ నెంబర్, ట్విట్టర్ ఖాతాల గురించి ఎక్కువ మంది అడిగారు.