జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు.. హీరో సూర్య మద్దతు..!

Oneindia Telugu 2018-01-16

Views 447

Tamil actor Surya has suppported YSR Congress party president YS Jagan Praja Sankalpa Yatra.

ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్‌కు ఊహించని వైపు నుంచి మద్దతు లభించింది. తమిళ నటుడు సూర్య ఆయనకు మద్దతు ప్రకటించారు.
ప్రజలు ఏదో మంచి చేయాలనే తపన వైయస్ జగన్మోహన్ రెడ్డిలో బలంగా ఉందని సూర్య అన్నారు. అందుకే గొప్ప ఆలోచనతో జగన్ పాదయాత్ర చేపట్టారని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ జగన్‌లో కష్టపడే తత్వం ఎక్కువ అని ఆయన కొనియాారు.
ప్రజలకు మేలు జరుగుతుందంటే జగన్ ఎంత దూరమైనా వెళ్తారని సూర్య అన్నారు. వైయస్ జగన్, తాను కలుసుకున్నప్పుడు తమ మధ్య రాజకీయాంశాలు పెద్దగా చర్చకు రావని, అయితే ప్రజలకు ఏదో చేయాలనే బలమైన తపన వైయస్ జగన్‌లో తాను గమనించినట్లు తెలిపారు.
వైఎస్ రాజశేఖర రెడ్డిని కోల్పోవడం అందరికీ తీరని లోటని నటుడు సూర్య అన్నారు. రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర చాల ప్రాధాన్యం కలిగిందని, ప్రస్తుతం జగనన్న చేస్తున్న పాదయాత్ర కూడా అదే తరహాలో విజయవంతం కావాలని కోరుకుంటూ ఆనయన ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య జగన్ పాదయాత్ర గురించి మాట్లాడారు. సూర్య వ్యాఖ్యలపై నెటిజన్లు వివిధ రీతుల్లో స్పందిస్తున్నాుర "సూర్య సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో జగన్ రియల్ హీరో.. జై జగన్... జై సూర్య... జగన్‌కు సూర్య తోడుండాలి" అని కామెంట్ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS