Tamil Nadu Yuvasakki president Kethireddy Jagadeeswar Reddy appeals to Chiranjeevi to Interveen in the controversy took place between Mahesh Kathi and Pawan Kalyan's fans.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులకు, మహేష్ కత్తికి మధ్య తలెత్తిన వివాదంలో జోక్యం చేసుకోవాలని సినీ నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని కోరారు.
గతంలో మీపై సినీ నటుడు రాజశేఖర్ వ్యాఖ్యలు చేస్తే, అందుకు నిరసన గా మీ అభిమానులు ఆయనపై దాడి చేశారు.,మీరు స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్సించి ఒక మంచి సంప్రదాయానికి నిదర్శనంగా నిలిచారు అని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. అలా వివాదాన్ని పరిష్కరించారని ఆయన అన్నారు.
గుణగణాల ద్వారా పవన్ కల్యాణ్ ఎవరికీ తలవంచరని, గతంలో ప్రజారాజ్యం పార్టీ యువనేతగా పవన్ కల్యాణ్ కాంగ్రెస్ వారిని పంచలు విప్పాలని అన్నారని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గుర్తు చేశారు..పవన్ కల్యాణ్ నిజాయితీ పరుడని, నిజాయితీ ఉన్నవాడికి ఆవేశం ఎప్పుడు ఉంటుందని, .తాము చేప్పాలనుకున్న మాటలను నిక్కచ్చిగా చెప్పడానికి సంకోచించరని ఆనయ అన్నారు.
పవన్ కల్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన ఎర్పాటు చేసిన జనసేన పార్టీ లక్యం నచ్చితే జనం తప్పకుండా ఆదరిస్తారని, చంద్రబాబు నాయుడికి గత ఎన్నికల్లో ప్రచారం చేసి అ పార్టీ విజయంలో భాగస్వామి అయ్యారని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. అందువల్ల రాష్ట్రంలో తన దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడం పవన్ కల్యాణ్ బాధ్యత అని ఆయన అన్నారు.